Chandrababu: వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:54 PM
శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ (Pensions Distribution to Old Age) చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savitha). ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు (MS Raju), సింధూర రెడ్డి (Sindhura Reddy), కందికుంట వెంకటప్రసాద్ (Kandikunta Venkataprasad) , జిల్లా కలెక్టర్ చేతన్ (Collector Chetan) , ఎస్పీ రత్న (SP Ratna) తదితరులు హాజరయ్యారు.
మంత్రి సవితా కామెంట్స్..
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సవిత ఆదేశించారు.
కాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి బయలుదేరారు. మధ్యాహ్నం 1-50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడనుంచి విజయవాడలోని ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో బయలుదేరి వస్తారు. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం బిజీ బిజీగా గడిపారు. నీతి అయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని ప్రత్యేకంగా ఏదోఇచ్చారన్నట్లు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్రం సాయం చేస్తున్నందున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో పొలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం, ఇక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. ‘కొత్త వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించినట్లు చెప్పారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వె్‌స్టమెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పుడది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. ’పోలవరం ప్రాజెక్టులో ముందు డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలి. ఆ తర్వాత ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్ అంతా ఎత్తిపోస్తూ.. వాల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు సీజన్ల కంటే ముందే.. దీనిని కట్టేస్తే ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు వెంటనే చేపట్టవచ్చు. ప్రాజెక్టులో తొలిదశ, మలిదశ అనేవి లేవు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒక్కటే మా లక్ష్యం. చేపట్టాల్సిన పనుల్లో ముందు ఏవి పూర్తి చేయాలనేందుకే దశలుగా పేర్కొంటున్నాం. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ పోర్టుకు ఎప్పుడూ ఇలాంటి మచ్చరాలేదు..
విచారణకు సహకరించని మోహిత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన..
భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News