Share News

AP ELECTIONS: మార్పు మొదలైంది గురూ!

ABN , Publish Date - May 04 , 2024 | 12:42 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన

AP ELECTIONS: మార్పు మొదలైంది గురూ!

కూటమికే జై కొడుతున్న మహిళలు

మేనిఫెస్టోలో ఆర్థిక భరోసానిచ్చే పథకాలు

వైసీపీ అభ్యర్థులకు కూటమి మేనిఫెస్టో ఫోబియా

అనంతపురం, మే 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే


అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన పథకాలనే మళ్లీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతాంగం, కార్మికులు, మహిళల్లోనూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమలు చేస్తామని జగన హామీ ఇచ్చారు. కనీఈ ఒక్కరికే అమలు చేశారు. అమ్మఒడి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. చివరకు రూ.13 వేలతో సరిపెట్టారు. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలతో మహిళల ఆర్థిక సాధికారితకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. బటన నొక్కారేగాని.. సకాలంలో వారి ఖాతాల్లో సొమ్ము జమచేయలేదు. చేయూత, ఆసరా సొమ్ము ఈ విడత ఇంకా జమకాలేదు. మహిళలకు సంబంధించిన పథకాలను సక్రమంగా అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిణామాలన్నీ వైసీపీని మరింత ఇరుకునపెడుతున్నాయి.

కూటమికే జై..

కూటమి మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక స్వావలంభనకు, సాధికారితకు పెద్దపీట వేశారు. దీంతో ఆ వర్గాలు కూటమికి జై కొడుతున్నాయి. సూపర్‌సిక్స్‌ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో.. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం, ప్రత్యేక పథకం ద్వారా పి-4 మోడల్లో మహిళలకు ఆర్థికంగా


బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంగనవాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామనడం, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామనడం, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామనడం, కళలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు అందిస్తామనడం, పండుగలు, పెళ్లిళ్లకు కానుకలు పునరుద్దరిస్తామని చెప్పడం, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామనడం మహిళల్లో సంతోషాన్ని నింపుతోంది. వైసీపీ పాలనలో జరిగిన లబ్ధితో పోల్చుకుంటే.. కూటమి మేనిఫెస్టోలో మహిళల కోసం అమలు చేయబోయే పథకాల ద్వారానే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని మహిళలు అంటున్నారు. కుటుంబానికి ఆర్థిక చేయూతతో పాటు.. జీవన ప్రమాణాల పెంపునకు టీడీపీ మేనిఫెస్టో బాటలు వేస్తుందన్న నమ్మకం మహిళల్లో కనిపిస్తోంది.

మహిళలే నిర్ణేతలు..

జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 20,20,243 మంది కాగా, వీరిలో పురుషులు 9,99,835 మంది, మహిళలు 10,20,162 మంది ఉన్నారు. ఇతరులు 246 మంది ఉన్నారు. పురుషులకంటే మహిళలు 20,327 మంది అధికంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.


.. రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,64,418 మంది కాగా, అందులో పురుష ఓటర్లు 1,30,858 మంది, మహిళా ఓటర్లు 1,33,518 మంది ఉన్నారు. ఉరవకొండలో 2,24,574 మంది ఓటర్లుండగా... అందులో పురుషులు 1,10,772 మంది, మహిళలు 1,13,774 మంది ఉన్నారు. గుంతకల్లులో 2,71,057 మంది కాగా.. పురుషులు 1,33,347 మంది, మహిళలు 1,37,635 మంది ఉన్నారు. తాడిపత్రిలో 2,49,103 మంది ఓటర్లుండగా... పురుషులు 1,23,714 మంది, మహిళలు 1,25,369 మంది ఉన్నారు. శింగనమలలో 2,47,803 మంది ఓటర్లుండగా... పురుషులు 1,23,351 మంది, మహిళలు 1,24,423 మంది ఉన్నారు. అనంతపురం అర్బనలో 2,81,403 మంది ఓటర్లుండగా... పురుషులు 1,37,890 మంది, మహిళలు 1,43,488 మంది ఉన్నారు. కళ్యాణదుర్గంలో 2,30,905 మంది ఓటర్లుండగా... పురుషులు 1,14,473 మంది, మహిళలు 1,16,426 మంది ఉన్నారు. రాప్తాడులో 2,50,979 మంది ఓటర్లుండగా, పురుషులు 1,25,430 మంది, మహిళలు 1,25, 537 మంది ఉన్నారు. ఇలా.. ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే అన్ని నియోజకవర్గాల్లో నిర్ణయించనున్నారు. ఇది టీడీపీ కూటమిలో జోష్‌ నింపుతుండగా.. వైసీపీ అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది.


మేనిఫెస్టో ఫోబియా..

జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు కూటమి మేనిఫెస్టో ఫోబియా పట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కూటమి మేనిఫెస్టో ఉంది. ఇది వైసీపీ అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఐదేళ్లలో అమలు చేసిన నవరత్నాలనే కొనసాగిస్తూ.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది ఆ పార్టీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సీఎం జగన.. 175కి 175 స్థానాలు గెలవాలని చెబుతున్నారేగాని.. అందుకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన నెరవేర్చలేదు. టీడీపీ మేనిఫెస్టో ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లా, అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. రాయలసీమ మిషన పేరుతో సీమ అభివృద్ధిని కాంక్షించే అంశాలు ఉన్నాయి. ఈ పరిణామాలను చూసి వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 12:42 AM