Share News

AP EMPLOYEES : బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:20 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, పేరుకుపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఈఏ, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. నగర శివారులోని ఓ ఫంక్షన హాలులో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సును నిర్వహించారు.

AP EMPLOYEES : బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన
APGEA state president Suryanarayana speaking at the conference

రూ.25 వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు..?

ప్రభుత్వ అలసత్వంపై ఉద్యోగ సంఘాలు స్పందించాలి

ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 21: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, పేరుకుపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఈఏ, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. నగర శివారులోని ఓ ఫంక్షన హాలులో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సును నిర్వహించారు. సదస్సు ఆరంభానికి ముందు ఎంపీడీఓ గీతావాణి, ఇతర అధికారులు అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల కోడ్‌ ఉంది కదా..? అనుమతి తీసుకున్నారా..?


సదస్సు ఎలా నిర్వహిస్తారు..?’ అని ప్రశ్నించారు. సదస్సు గురించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని సూర్యనారాయణ వారికి తెలిపారు. తాము ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వచ్చేలా సదస్సు పెట్టుకోలేదని అన్నారు. కోడ్‌ కారణంగా సదస్సుకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిమితి ఉన్నట్లు నిబంధనలు ఉంటే చూపాలని, ఆ తర్వాత తనకు నోటీసు ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. దీంతో ‘మా బాధ్యత కాబట్టి చెబుతున్నాం’ అంటూ ఎంపీడీఓ వెనుదిరిగారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కాకపోగా, జటిలంగా మారాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వారి అస్తిత్వానికే ప్రమాదమని అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల్లో మార్పు రావాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సంఘాల మధ్య ఉన్నది భేదాభిప్రాయమేగాని, వ్యక్తిగత కక్షలు కాదని అన్నారు. అందరి లక్ష్యం


ఉద్యోగుల సంక్షేమమేనని అన్నారు. ఆ దిశగా కార్మిక స్థాయి నుంచి ఉద్యోగుల వరకూ చైతన్యం తెచ్చేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం సదస్సు వేదికపై ఆయన ప్రసంగించారు. రూ.25 వేల కోట్ల చెల్లింపు ఆగిపోయినా ఉద్యోగ సంఘాలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వీటిని ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ ఉద్యోగులకు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏర్పడిన సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు.


సచివాలయ ఉద్యోగుల సర్వీస్‌ రెగ్యులరైజేషన ఆలస్యం కావడంతో ప్రతి ఉద్యోగికి 9 నెలల నుంచి 10 నెలల జీతం పెండింగ్‌లో ఉందని వివరించారు. 30 ఏళ్లుగా ఎలాంటి సర్వీసు రూల్స్‌ లేని కారణంగా ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతులు కోల్పోతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాల అలసత్వం కారణంగా అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కో చైర్మన హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన, ఉపాధ్యక్షులు రవీంద్రబాబు, రమే్‌షకుమార్‌, పాపారావు, కేదారేశ్వరరావు, అబ్దుల్‌ రజాక్‌, ఆర్గనైజిగ్‌ సెక్రెటరీ మాంగటి శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కార్యదర్శులు మహేశ్వర్‌రెడ్డి, రాము నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:48 AM