AP NEWS: దైవదర్శనానికి వెళ్లి.. ఇంటికి బయలు దేరగా.. అంతలోనే అనుకోని ఘటన
ABN , Publish Date - Dec 21 , 2024 | 07:09 AM
తిరుమల దైవ దర్శానానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి.
శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిరలో ఇవాళ(శనివారం) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం మడకశిర తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హిందూపురం, బెంగళూరు తరలించారు. తిరుమల దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో వ్యాన్‌లో 14మంది యాత్రికులు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఏలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు
YS Sharmila : వారే కొట్టుకుని.. రాహుల్‌ను అంటున్నారు
AP High Court : మధ్యవర్తిత్వంపై హైకోర్టులో ముగిసిన శిక్షణ
Read Latest AP News and Telugu News