Share News

AP Politics: దందా చేసి దూరం కావొద్దు... జేసీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:41 PM

Andhrapradesh: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

AP Politics: దందా చేసి దూరం కావొద్దు... జేసీ సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy

అనంతపురం, ఆగస్టు 27: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (Former MLA JC Prabhakar Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘నా దగ్గరి వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారు.. ఈ పనులు ఆపండి.ఎందుకు మీరే సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోవద్దా?.. కానీ నా నియోజకవర్గంలో ఇసుక దందా వద్దు. నా కోసం ఐదు సంవత్సరాలు పని చేశారు. మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా క.. నీ ఇసుక దందా వద్దు.. నాకు దూరం కాకండి’’ అంటూ జేసీ వీడియోలో పేర్కొన్నారు.

Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం


మరిన్ని జేసీ కామెంట్స్

తాడిపత్రి నియోజకవర్గంలో మొత్తం 25 మంది ఇసుక దందా చేస్తున్నారని.. వారందరూ తనకు ఆప్తులన్నారు. ఐదు సంవత్సరాలుగా తనతో పాటు కష్టపడ్డారని తెలిపారు. ఇసుక దందాను మానుకోండి అని వినతి చేశారు. నియోజకవర్గంలో 2.50లక్షల మంది ఓటర్లు ఉంటే డబ్బులు కావాల్సింది కేవలం ఈ 25 మందికేనా ప్రశ్నించారు. దయచేసి దూరం చేసుకోవద్దని కోరారు. ‘‘ గత ప్రభుత్వంలో ఇసుకు అక్రమ రవాణాపై గ్రీన్‌ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లి మరీ పోరాడాను. నన్ను పట్టుకుని అన్ని ఊర్లు తిప్పి, పోలీస్‌స్టేషన్‌కు తిప్పితే.. మీ దయ వల్లే బయటకు వచ్చా. కానీ ఇసుక దందా చేసి దూరం కావొద్దు. ఇటీవల ఏసీబీ విచారణ జరిగింది. మీకు వచ్చేది ఏమీ లేదు’’ అని స్పష్టం చేశారు.

TG News: అధికారులే మీ ఇంటికొస్తారు..


‘‘టిప్పర్ ఓనర్లకు ఇదే నా హెచ్చరిక.. మీ బండ్లు బయటకు రావు. నా నియోజకవర్గంలో మాత్రం ఇసుక అక్రమ రవాణా చేయొద్దు. మీరే డబ్బులు సంపాదించుకోవాలా?... నేను ఎంతో పోగుట్టుకున్నాను. నేను సంపాదించుకోవద్దా?.. మీకు అమ్మడం కూడా చేతకాదు.. మీరు ఎవరిని ఉపయోగించుకుంటున్నారో నాకు తెలుసు. గత ప్రభుత్వ హాయంలోని వ్యక్తుల సాయం లేకుండా ఒక ట్రిప్పును కూడా అమ్ముకోలేరు. ఇళ్లు నిర్మించేందుకు ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. దయచేసి దూరం కావొద్దు. ఐదేళ్లు నాకోసం కష్టపడ్డారు. మీకు వేరే విధంగా సహాయం చేయగలను. టిప్పర్‌లు నా నియోజకవర్గంలో తిరిగితే.. వదిలిపెట్టేది లేదు. ఇసుక దందా చేసి నాకు దూరం కావొద్దు. అక్రమ ఇసుక రవాణా చేయొద్దు. విచారణ జరుగుతోంది.. జాగ్రత్త’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Madanapalli Incident: తెల్లవారేవరకు మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారుల తిష్ట

Hyderabad: ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2024 | 01:48 PM