Share News

TDP BFORM : ఇక దూసుకువెళ్లండి..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:28 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులకు సూచించారు. భేషజాలను వీడి, అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని, గెలుపే లక్ష్యంగా పనిచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నందున.. రానున్న 20 రోజులు మరింతగా కష్టపడాలని అన్నారు. అమరావతిలో జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులకు ఆదివారం ఆయన బీ ఫారాలను అందజేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యచరణ గురించి అభ్యర్థులకు వివరించారు.

TDP BFORM : ఇక దూసుకువెళ్లండి..!
TDP candidates who received B forms with Chandrababu Naidu

మాట తప్పిన జగనను ఏకి పారేయండి

సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు చెప్పండి

టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతిలో బీ ఫారాల అందజేత

అనంతపురం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులకు సూచించారు. భేషజాలను వీడి, అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని, గెలుపే లక్ష్యంగా పనిచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నందున.. రానున్న 20 రోజులు మరింతగా కష్టపడాలని అన్నారు. అమరావతిలో జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులకు ఆదివారం ఆయన బీ ఫారాలను అందజేశారు.


ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యచరణ గురించి అభ్యర్థులకు వివరించారు. ప్రచార అజెండా, పోల్‌ మేనేజ్‌మెంట్‌ కీలకమని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలు, భూకబ్జాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. జగనను ఏకిపారేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో జగన ఇచ్చిన హామీలను విస్మరించిన వైనాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. బటన నొక్కుడుతో కొందరికే లబ్ధి చేకూరిందని, అత్యధిక మందికి వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం, ఆ వర్గాల పథకాలను రద్దు చేసిన విషయాన్ని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు


విస్మరించిన హామీలను కూడా ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. సీఎం జగన మోసాలు, అబద్ధాలు, సిటింగ్‌ ఎమ్మెల్యేల అకృత్యాలు, దౌర్జన్యాలు, అక్రమాలపై ముప్పేట దాడిచేస్తూ.. ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. ఈ 20 రోజులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. జగన మోసాలు, ఐదేళ్ల పాలనలో అరాచకాలు, విధ్వంసాలపై ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి.. ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభ్యర్థులు ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి, గెలుపును నల్లేరుమీద నడకగా మార్చుకోవాలని సూచించారు. అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, అనంతపురం అర్బన అసెంబ్లీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం, శింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి చంద్రబాబు బీఫారాలను అందజేశారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులు బి-ఫామ్‌లు అందుకోవాల్సి ఉంది..

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:47 AM