Share News

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:46 PM

పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని జేపీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్
JC Prabhakar Reddy

అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ (Tadipatri Municipal Chairman) జేపీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేసినప్పుడు సభ్యత ఏమైందంటూ కౌంటర్ అటాక్ చేశారు. తన తప్పులు లేని రోజున తాను గడ్డం తీసేస్తానని, అందుకే తాను గడ్డం పెంచుతున్నానని.. ఊరికే కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు కాబట్టి వైఎస్సార్‌సీపీ నేతలు ఇవాళ బయటికి వస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ హయాంలో అయిదేళ్లు మమ్మలను బయటికి రానివ్వలేదని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్ళారని.. నువ్వు (పేర్ని నాని) ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావని ఆయన అన్నారు.


పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబుకు సూచించారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పేర్ని నాని నిన్నటి ప్రెస్ మీట్‌లో రక్తం చుక్క లేకుండా కనిపించారని, ఆడవాళ్లు అంటే గౌరవం ఉందా.. అని ప్రశ్నించారు. తమపై కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు లేరా అని అన్నారు.

‘‘నీ కుటుంభం గురించి చెప్తే ఉరి వేసుకుంటావ్.. విక్టోరియా గురించి చెప్పాలా... సీఎం చంద్రబాబు మంచోడు.. ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేస్తే సభ్యత గుర్తుకు రాలేదా.. పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు... ఆయన మంచోడు కాబట్టి ఊరికే ఉన్నారు.. చంద్రబాబు మంచి తనంతో మా చేతులు కట్టేసారు.. సిగ్గు లేకుండా ఇవాళ మహిళల గురించి మాట్లాడుతావా.. చంద్రబాబు గారు.. వైఎస్సార్‌సీపీ వాళ్ళు మీ మంచి తనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారు.. కొన్ని రోజులు బాబు గారు టూర్‌కు వెళ్తే మేలు’’ అంటూ జేపీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ సోషల్ మీడియా సెల్ తమపై తప్పుడు రాతలు రాస్తోందని పేర్ని నాని ఆరోపించారు. బియ్యం మిస్సింగ్ స్కామ్‌లో ఇరుక్కు్న్న పేర్ని నాని కుటుంబం.. పరారీలో ఉందంటూ గత కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఈ వ్యవహారంపై స్పందించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ గోడౌన్‌లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారని.. నైతిక బాధ్యత వహిస్తూ తన సతీమణి అధికారులకు ఒక లేఖ రాశారని గుర్తు చేశారు. టెక్నికల్‌గా తమ బాధ్యత లేకున్నా.. నైతికంగా బాధ్యత వహిస్తామని ఆ లేటర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. అధికారులు తనిఖీలు చేసి 3,800 బస్తాలు తగ్గాయన్నారు. దాని తాలూకు వారి చెప్పినట్లుగా నగదు చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు. అయినాసరే తమపై కక్ష కట్టి తన భార్య, గోడౌన్‌ ఇన్‌చార్జి మీద కేసు నమోదు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. పదే పదే పీపీలను మార్చుతూ అడ్డంకులు సృష్టించారన్నారు. తనపై కక్షతో తన భార్య మీద అక్రమ కేసు పెట్టారని నాని ఆరోపించారు. తాము పారిపోయినట్లు అసత్య ప్రచారాలు చేశారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 12:49 PM