Share News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

ABN , Publish Date - Nov 23 , 2024 | 08:55 PM

జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పొలం పనుల నుంచి ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. రోడ్డుప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతిచెందిన ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనం..


అయితే రోడ్డుప్రమాదానికి గురైన వారంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఇవాళ(శనివారం) ఉదయం పని నిమిత్తం గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు వెళ్లారు. పొలం పనుల అనంతరం ఇంటికి తిరుగు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వారి ప్రాణాలను బలి తీసుకుంది. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలగాసిపల్లి వద్ద ఆటోను ఎదురుగా వెళ్లి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ


ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన బాధితులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ మరో ఐదుగురు కూలీలు మృతిచెందారు. దీంతో మెుత్తం మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. మరోవైపు నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతులు తాతయ్య, చిననాగమ్మ, రామాంజనమ్మ, పెదనాగమ్మ, కొండమ్మ, జయరాముడు, చిననాగన్నగా పోలీసులు గుర్తించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో బీజేపీ కూటమికి భారీ మెజార్టీ..

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ

Updated Date - Nov 23 , 2024 | 09:22 PM