Share News

Anantapur : ఘోరం.. మంచు కారణంగా అదుపుతప్పిన కారు.. ఎంతమంది మృతంటే..

ABN , Publish Date - Dec 01 , 2024 | 08:54 AM

కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు యోగేశ్‌, గోవిందరాయ, అమరేశ్‌ విహారయాత్రకు హాంకాంగ్ వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన బళ్లారికి వెళ్లేందుకు బయలుదేరారు.

Anantapur : ఘోరం.. మంచు కారణంగా అదుపుతప్పిన కారు.. ఎంతమంది మృతంటే..

అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు సమీపంలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. అతివేగంతో వస్తున్న కారు.. మంచు కారణంగా అదుపుతప్పింది. అనంతరం చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చల్లాచదురుగా పడిపోయాయి. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారిలో ఇద్దరు డాక్టర్లు సహా ఓ డ్రైవర్ ఉన్నాడు.


కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు యోగేశ్‌(52), గోవిందరాజు(54), అమర్ గౌడ్(55) విహారయాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆదివారం తెల్లవారుజాము 1:30 ప్రాంతంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన బళ్లారికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో రోడ్డు మెుత్తం మంచు కప్పేసింది. డ్రైవర్‌కు దారి సరిగ్గా కనిపించలేదు.


డ్రైవర్ అతివేగం కూడా ప్రమాదానికి తోడైంది. దీంతో అదుపుతప్పిన కారు బలంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. వైద్యులు యోగేశ్, గోవిందరాజు, డ్రైవర్ వెంకట నాయుడు(53) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో డాక్టర్‌ అమర్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. వారి మృతదేహాలు రోడ్డుపై పడిపోయాయి. గమనించిన వాహనదారులు 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బళ్లారికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Tiruvuru: భయంతో పరుగులు పెట్టిన మహిళ.. విషయం ఇదే..

Egg Rate: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ఎంతకు చేరిందంటే.

Updated Date - Dec 01 , 2024 | 09:05 AM