-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh and Telangana Telugu Latest News Live updates on Thursday 19 September 2024 psnr
-
Live Updates: జనసేనాని గ్రీన్ సిగ్నల్.. బాలినేని చేరిక కన్ఫామ్..
ABN , First Publish Date - Sep 19 , 2024 | 07:21 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-19T17:49:02+05:30
జనసేనాని గ్రీన్ సిగ్నల్.. బాలినేని చేరిక కన్ఫామ్..
అమరావతి: పవన్ కళ్యాణ్‌తో ముగిసిన బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ.
దాదాపు గంట పాటు ఇరు నేతల మధ్య చర్చ.
ఈనెల 22న జనసేనలో చేరికలు.
బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయ భానులు 22న జనసేనలో చేరనున్నారు.
జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న వైసిపి కీలక నేతలు.
ఇటీవల వైసిపికి రాజీనామా చేసినట్లు ప్రకటన.
పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత ఈ నెల 22 న చేరేలా టైమ్ ఫిక్స్ చేసిన జనసేనాధిపతి.
-
2024-09-19T16:50:40+05:30
వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉంది: మాజీ ఎమ్మెల్యే
అమరావతి: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉదయభాను సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
నా మనసుకి కష్టం కలిగింది కాబట్టి పార్టీ వీడాను.
వైయస్‌తో ఎంతో సన్నిహితంగా పని చేశాను.
ఆయన కుమారుడితో అదే కమ్మిట్ మెంట్‌తో వైసిపిలో నడిచాను.
ఎన్నికలకు ముందు అనేకసార్లు జగన్‌ను కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదు.
వైసిపిలో పరిణామాలు చూస్తే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనిపిస్తుంది.
మా భవిష్యత్తు మేము చూసుకోవాలనే బయటకి వచ్చాం.
పవన్ కళ్యాణ్‌తో కలిసి అన్ని విషయాలు చర్చించాను.
ఈనెల 22 వ తేదీన జనసేనలో చేరుతున్నాను.
బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా చేరుతున్నట్లు తెలిసింది.
కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను.
-
2024-09-19T14:50:37+05:30
మాజీ మంత్రి అక్రమాలపై విచారణకు ఆదేశం..
మాజీ మంత్రి విడుదల రజినిపై హోమంత్రి అనితకు ఫిర్యాదు.
రజినీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
సానుకూలంగా స్పందించిన మంత్రి అనిత.
విడుదల రజినీ అక్రమాలపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత.
మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన పల్నాడు జిల్లా యడ్లపాడు శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం.
స్టోన్ క్రషర్ యాజమాన్యం నుండి రూ. 2.5 కోట్లు మాజీ మంత్రి విడుదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పీఏ గోపి వసూలు చేసినట్లు ఫిర్యాదు.
న్యాయం చేయాలని హోం మంత్రిని కోరిన ఫిర్యాదు దారులు.
-
2024-09-19T14:20:51+05:30
మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ..
శుక్రవారం నుంచి మళ్ళీ మొదలు కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.
కమిషన్ ముందుకు రానున్న ఏడుగురు CE స్థాయి ఇంజనీర్లు.
కమిషన్ బహిరంగ విచారణకు రానున్న రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు.
గత నెలలో 15 మందికి పైగా విచారణ చేసిన కమిషన్.
రేపటి నుంచి 25 మందికిపైగా విచారణ చేయనున్న కమిషనర్.
NDSA, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్‌కు కావాల్సిన సమాచారం ఇస్తానని చెప్పిన ఆయా టీమ్స్.
కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి అంగీకరించిన ప్రభుత్వం.
అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ బహిరంగ విచారణ చేయనున్న కమిషన్.
-
2024-09-19T13:32:38+05:30
నటి కాదంబరి సంచలన కామెంట్స్..
అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వాని హోంమంత్రి అనితను కలిశారు.
ఆమె తల్లిదండ్రులు, అడ్వకేట్‌తో అమరావతి వచ్చిన ఆమె మంత్రిని కలిశారు.
మీడియాతో మాట్లాడిన కాదంబరి.. కీలక కామెంట్స్ చేశారు.
నా తల్లిదండ్రులు, అడ్వకేట్‌తో హోంమంత్రిని కలిశాం.
మాపై పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని వివరించాం.
మాపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చాలా గట్టిగా పోరాటం చేసాం.
మాకు మా ఫ్యామిలీకి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాం.
మాకు ఎమోషనల్, మెంటల్, ఫిజికల్‌గా ఇబ్బందులు కలిగాయిజ.
దానికి పరిహారం ఇవ్వాలని అడిగాము.
మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కొరాము.
ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు.
మీడియా సైతం మాతో కలిసి పోరాటం చేశారు.
దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వుంది అనేది తెలియదు.
అంతా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది.
-
2024-09-19T13:14:47+05:30
నందిగం సురేష్‌కు రిమాండ్ పొడిగింపు..
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్ పొడిగింపు.
మరో 14 రోజు రిమాండ్ విదించిన మంగళగిరి కోర్టు.
టిడిపి ఆఫీస్‌పై దాడి కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్.
-
2024-09-19T12:21:39+05:30
Big Breaking: జానీ మాస్టర్ అరెస్ట్..
జానీ మాస్టర్‌ని గోవాలో అరెస్టు చేసిన పోలీసులు.
గోవా కోర్టులో జానీ మాస్టర్‌ని హాజరు పరుస్తున్న పోలీసులు.
గోవా కోర్టులో హాజరు పరిచి పిటి వారెంట్ కింద హైదరాబాద్ తరలించనున్న పోలీసులు.
-
2024-09-19T11:40:51+05:30
వినుకొండ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే..
త్వరలో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందన్న ఎమ్మెల్యే
బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్‌తో జగన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నాడు
త్వరలో తల్లి కాంగ్రెస్‌లోకి పిల్ల కాంగ్రెస్ కలుస్తుంది
ఇది తెలిసిన కొంత మంది వైసీపీ నేతలు ముందస్తుగా వాళ్ల దారులు వాళ్లు వెతుక్కుంటున్నారు
కూటమి 100 రోజుల పాలన అద్భుతంగా ఉంది
100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైంది
ఇక మన పార్టీ మనుగడ కష్టమనే నిర్ణయానికి ఆ పార్టీ నేతల్లో వచ్చింది
చంద్రబాబు-పవన్ జోడీ సూపర్ సక్సెస్
అందుకే రోజుకొకరు పార్టీ వదిలి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు
వీళ్ళందరి కంటే ముందే వాళ్ల నేత జగన్ రెడ్డి బెంగుళూరులో దారులు వెతుక్కుంటున్నాడు
సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
-
2024-09-19T11:00:47+05:30
హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జత్వానీ
వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితను కలవనున్నారు
మరి కాసేపట్లో సెక్రటేరియట్‌లో హోంమంత్రితో భేటీ
తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని కోరనున్న జత్వానీ
విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరనున్న జత్వానీ
తనపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అక్రమ అరెస్ట్ చేసి మానసిక వేధింపులకు గురి చేసినందుకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరనున్న ముంబై నటి
-
2024-09-19T10:34:31+05:30
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 19న) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి ఎగబాకాయి. నిఫ్టీ-50 సూచీ 0.47 శాతం వృద్ధి చెంది 25,500 వద్ద ఆరంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.51 శాతం మేర పెరిగి 83,369.78 వద్ద ప్రారంభమైంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 53,100 దాటింది. మిడ్‌క్యాప్ ఐటీ షేర్లలో మంచి వృద్ధి నమోదైంది. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా బలంగా ఉన్నాయి. అమెరికాలో బుధవారం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది.
-
2024-09-19T10:22:45+05:30
సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్
సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ
అతిశితో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సెప్టెంబర్ 21న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
-
2024-09-19T09:43:13+05:30
కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య
వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా?
ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది
ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి
పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు
అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు..
అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకు...
అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టాడు
ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు
రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు
-
2024-09-19T09:07:04+05:30
నేడు వైసీపీ వద్దకు బాలినేని శ్రీనివాస రెడ్డి!
నేడు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి
నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని
ఇవాళ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న సీనియర్ పొలిటీషియన్
పవన్ కల్యాణ్‌తో చర్చల అనంతరం బాలినేని చేయనున్న ప్రకటనపై అందరిలోనూ నెలకొన్న ఆసక్తి
బాలినేని చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
కీలక భేటీలో ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరం
-
2024-09-19T08:31:29+05:30
హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు
మాజీ ఎంపీ నందిగం సురేష్ పై హత్య కేసు నమోదు
తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో మరియమ్మ హత్య
నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి
హత్యపై మరియమ్మ కుమారుడు ఫిర్యాదులో నందిగం సురేష్ పేరు
అప్పట్లో అధికారం అండతో అరెస్ట్ చేయని పోలీసులు
తాజాగా మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌పై పీటీ వారెంట్
-
2024-09-19T07:53:02+05:30
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు పూర్తి
మొత్తం 1 లక్ష 25 వేల 111 గణనాథుల నిమజ్జనం జరిగినట్టు ప్రకటించిన జీహెచ్ఎంసీ
అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 28,946 గణనాథుల నిమజ్జనం
ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 5,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా 5,720 విగ్రహాల నిమజ్జనం
రాజేంద్రనగర్ పతికుంటలో 11,548 గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి
అల్వాల్ కొత్తచెరువులో 6,572, ముషీరాబాద్ బండ్ 7,457 వినాయకులను నిమజ్జనం చేసిన అధికారులు
గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో జరిగిన నిమజ్జనాలు
-
2024-09-19T07:44:09+05:30
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో కలెక్టరేట్ రోడ్డులో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత
భారీ బందోబస్త్ ఏర్పాటు చేసిన పోలీసులు
-
2024-09-19T07:31:34+05:30
కేటీఆర్‌పై మండిపడ్డ మెదక్ ఎంపీ రఘునందన్ రావు
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మండిపాటు
సెక్రటరీయేట్ ముందు రాజీవ్ విగ్రహం పెడితే కేటీఆర్‌కు ఎందుకు కోపం
తన తండ్రిదో, చెల్లెదో విగ్రహం పెట్టాలని అనుకున్నట్టుంది
అందుకే మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చేస్తామంటున్నారు
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు
ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్న రఘునందన్ రావు
-
2024-09-19T07:29:11+05:30
ఉచిత ఇసుక పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి
రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు
ఏపీ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి
-
2024-09-19T07:21:58+05:30
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతల కలకలం
మాజీ సీఎం జగన్‌తో భేటీకి మాజీ మంత్రి రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గైర్హజరు
జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ
హాజరు కాని సీనియర్ నేతలు
వీరిద్దరు మాజీల వైఖరీపై వైసీపీ వర్గాల్లో కలకలం
ఎందుకు రాలేదోనంటూ రాజకీయ వర్గాల్లో అనుమానాలు