Share News

Nara Bhuvaneshwari Birthday: భువనేశ్వరికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్..

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:42 AM

Nara Bhuvaneshwari Birthday: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు నేడు. ఆమె జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ విషెష్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు.

Nara Bhuvaneshwari Birthday: భువనేశ్వరికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్..
Nara Bhuvaneshwari Birthday File Photo

Nara Bhuvaneshwari Birthday: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు నేడు. ఆమె జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ విషెష్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.


అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

మరోవైపు నారా లోకేష్ కూడా తన మాతృ‌మూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలం. ప్రజలకు సేవల చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం. రోజూ అమ్మను ఆరాధిస్తాను. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేసిన ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.’ అని నారా లోకేష్ పోస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


టీడీపీ శ్రేణుల సంబరాలు..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నారా భువనేశ్వరి సైతం ఎంతో కష్టపడి పని చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. పార్టీకి బలం చేకూర్చారు. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో.. నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో భారీ కేక్‌లను కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:42 AM