Andhra Pradesh: మోదీ నిధులు ఇస్తున్నా.. అమలులో జగన్ విఫలం.. దగ్గుబాటి పురంధేశ్వరి..
ABN , Publish Date - Jan 28 , 2024 | 05:46 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలన్నీ ప్రాంతీయ పార్టీలు అంతా తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. శక్తి వందన్ పేరుతో మహిళలతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం అయ్యారు. మహిళల కోసం కేంద్రం అమలు చేస్తున్న పధకాలు, చేయూతను ప్రజల్లోకి తీసుకవెళ్లేలా స్వయం సహాయక సంఘాలను కలవాలని దిశానిర్దేశం చేశారు.
"మహిళల కోసం చాలా మంది స్వయం సహాయక గ్రూపులు మేమే ప్రారంభించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కోటి 20 లక్షల గ్రూపులు ఉన్నాయి. 11 కోట్ల మంది మహిళలకు చేయూతను అందిస్తున్నాం. నారీశక్తి పేరుతో రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ సభ్యులు మొత్తం ఈ స్వయం సహాయక గ్రూపుల వద్దకు వెళ్లి మాట్లాడాలి. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీలు తమ సభల్లో జనాల కోసం ఈ మహిళలను తరలిస్తున్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం మహిళలను ఉపయోగించుకున్నారనే వాస్తవం వారికి చెప్పాలి" అని పురంధేశ్వరి సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.