Bode Prasad: టీడీపీకి బోడే ప్రసాద్ రాజీనామా చేయనున్నారా.. ఆయన ఏమన్నారంటే..?
ABN , Publish Date - Mar 14 , 2024 | 09:14 PM
తెలుగుదేశం కోసం కమిట్‌మెంట్‌తో పని చేశానని తెలుగుదేశం సీనియర్ నేత బోడే ప్రసాద్(Bode Prasad) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధిష్ఠానం ఆదేశాలను తుచ తప్పకుండా పాటించానని తెలిపారు. ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశానని తెలిపారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం కోసం కమిట్‌మెంట్‌తో పని చేశానని తెలుగుదేశం సీనియర్ నేత బోడే ప్రసాద్(Bode Prasad) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధిష్ఠానం ఆదేశాలను తుచా తప్పకుండా పాటించానని తెలిపారు. ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశానని తెలిపారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను అన్నింటిని విజయవంతం చేశానని తెలిపారు. 17వ తేదీన చిలకలూరిపేటలో జరిగే సభకు సంబంధించిన సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈరోజు పార్టీ హై కమాండ్ నుంచి తనకు ఫోన్ చేసి పెనమలూరు సీటు ఇవ్వలేక పోతున్నట్లు చెప్పారని అన్నారు. తాను ఏం తప్పు చేయలేదు.. ఎవరికీ ఏం అన్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా 86 శాతంతో తానూ గెలుస్తానని తేలిందన్నారు. అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
తాను ఓటమి చెందిన సమయంలో కూడా ఇంత ఆవేదన చెందలేదన్నారు. ఈ ఐదేళ్లు కుటుంబాన్ని వదిలి పార్టీ కోసమే తన జీవితం అంకితం చేశానని అన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తాను చాలా బాధ పడుతున్నానని వాపోయారు. తాను చంద్రబాబుకి భక్తుడినేనని ఆయన ఆదేశిస్తే శిరసావహిస్తానని అన్నారు. చంద్రబాబు కుటుంబం నుంచి వస్తేనే అభ్యర్థిని తాము స్వాగతిస్తామని తెలిపారు. వారు కాకుండా బయటి వారికి టిక్కెట్ ఇస్తే తాను స్వతంత్రంగా గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తేల్చిచెప్పారు.తన మనోవేధనను పార్టీ అధిష్ఠానం అర్థం చేసుకోవాలని బోడే ప్రసాద్ అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి