Bollineni Ramarao: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను
ABN , Publish Date - Mar 11 , 2024 | 04:23 PM
ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ (TDP) ని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు (Bollineni Ramarao) స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు.
నెల్లూరు: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ (TDP) ని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు (Bollineni Ramarao) స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు. చంద్రబాబు వల్లే గతంలో ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కొత్తగా వచ్చిన అభ్యర్థి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని బొల్లినేని రామారావు కోరారు.
ఇవి కూడా చదవండి
Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరదీసిన జగన్ ప్రభుత్వం
Lokesh: జగన్ బిల్డప్ బాబాయి... డ్రోన్ చూసి భయపడ్డాడు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి