Share News

Breaking News: పట్టపగలే పెద్ద పులి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - Nov 30 , 2024 | 09:29 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News: పట్టపగలే పెద్ద పులి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
Breaking News

Live News & Update

  • 2024-11-30T12:52:43+05:30

    కొమురంభీం జిల్లాలో పెద్దపులి దాడి

    కొమురం భీం జిల్లాలో పెద్ద పులి దాడి

    పొలంలో పనిచేస్తున్న రైతు సురేష్‌పై పులి దాడి

    రైతు సురేష్‌కు తీవ్ర గాయాలు

  • 2024-11-30T11:45:09+05:30

    కుల గణనపై మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

    • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు

    • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు మేము అడ్డుపడలేదు

    • ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇప్పటివరకు మూడుసార్లు కలిశాను

    • ఓబీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి

    • కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఏర్పాటు చేయాలి

    • మెడికల్ సీట్లలో ఏడాదికి రూ.25 లక్షలు కట్టాలంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏ విధంగా కడుతున్నారు

    • ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం

    • కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు

    • సమాజంలో ఎవరి శాతం ఎంత అనేది తేల్చాలని రాహుల్ గాంధీ చెప్పారు

    • తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కుల గణన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు.

    • తెలంగాణలో కుల గణన 85శాతం పూర్తైంది

    • బీసీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు.. ఓబీసీలకు న్యాయం జరుగుతుందా

    • కేంద్ర ప్రభుత్వం ఎందుకు కుల గణన చేయడం లేదు

    • బడుగు బలహీన వర్గాలు బీజేపీకి ఓట్లు వేయడం లేదా

    • ఓట్లు వేసిన తమకు అన్యాయం జరుగుతుంటే నరేంద్ర మోడీ ఓబీసీ గా ఉండి ఏమీ చేయడం లేదు

    • మణిపూర్ లో ప్రజలు చనిపోతున్న ప్రధాని మోడీకి వెళ్లాలనే ఆలోచన లేదు

    • కేంద్ర ప్రభుత్వం కుల గణన బిల్లు పెడితే కాంగ్రెస్ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది

    • ఓట్లు బీసీలవి.. రాజ్యం మీదంటే నడవదు

  • 2024-11-30T11:03:26+05:30

    టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్

    • టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్ నియామకం

    • టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం

    • డిసెంబర్3తో ముగియనున్న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం

    • మహేందర్ రెడ్డి స్థానంలో బుర్రా వెంకటేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

  • 2024-11-30T10:49:59+05:30

    గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    • నర్సంపేట మహేశ్వరం శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

    • 3 కేజీల గంజాయి స్వాధీనం

    • నిందితుల్లో ఒకరు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న రవి

    • మరొకరు నర్సంపేట మండలం పర్శునాయక్ తండాకు చెందిన మనోహర్‌గా గుర్తింపు

  • 2024-11-30T10:47:28+05:30

    అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

    • చికాగోలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సాయి తేజ

    • నాలుగు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన సాయి తేజ

    • ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూకారపు సాయి తేజ కుటుంబం

  • 2024-11-30T10:45:30+05:30

    జంతువు కలకలం

    • మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం ఆకేరు వాగు సమీపంలో పులి పిల్లలా ఉన్న జంతువు కలకలం

    • అచ్చం పులిని పోలిన పోలికలు ఉండటంతో పులిపిల్ల అంటున్న స్థానికులు

    • పాదం, చారలు, ముఖం పులిని పోలినట్టు ఉన్న జంతువు

  • 2024-11-30T10:06:24+05:30

    చిలకలూరిపేటలో కేంద్రమంత్రి పర్యటన

    • చిలకలూరిపేట నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన

    • గోపాలంవారిపాలెంలోని టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించిన పెమ్మసాని .

    • టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

    • టెక్స్ టైల్ పార్క్ సమస్యలు, పురోగతిపై అధికారులు, నిర్వాహకులతో సమీక్ష

    • టెక్స్ టైల్ పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న పెమ్మసాని

  • 2024-11-30T09:52:14+05:30

    ఘోర రోడ్డు ప్రమాదం

    • విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై ప్రమాదం

    • ఒక మహిళతో పాటు నలుగురు మృతి

    • లారీ కారు ఢీకొనడంతో ప్రమాదం

    • శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపై కి వెళ్లి బోల్తా

    • లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

  • 2024-11-30T09:45:33+05:30

    మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

    • ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ రాజకీయ కుట్ర ఉంది

    • బీఆర్ఎస్ నాయకులతో సంబంధం ఉన్న ఉద్యోగులు కావాలనే ఇలా చేస్తున్నారు

    • రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునే కుట్ర జరుగుతోంది

    • ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారు

  • 2024-11-30T09:38:30+05:30

    నిలిచిపోయిన ప్రయివేట్ ఆర్టీసీ బస్సులు

    • వికారాబాద్‌లో నిలిచిపోయిన 38 ప్రైవేటు ఆర్టీసీ బస్సులు

    • మహబూబ్‌నగర్ సీఎం సభకు వెళ్తున్న 25 ఆర్టీసీ బస్సులు

    • బస్సుల కొరతతో ప్రయాణీకుల తీవ్ర ఇబ్బందులు

    • బస్సులు తక్కువగా ఉండడంతో ఒకే బస్సులో కిక్కిరిసి ప్రయాణం

    • పాఠశాలలు, కళాశాలకు వెళ్ళేందుకు బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు

    • కొందుర్గు మండలం రామచంద్రపురం వద్ద శుక్రవారం ఆర్టీసీ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న ప్రయాణికులు

    • ఈ ఘటనకు నిరసనగా బస్సులు నిలిపివేసిన ప్రయివేట్ డ్రైవర్లు

    • ఆర్టీసీ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన