Chinta mohan: దేశ రాజకీయం చంద్రబాబు చేతిలో ఉంది.. చింతా మోహన్ ప్రశంసలు
ABN , Publish Date - Oct 04 , 2024 | 11:13 AM
పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ప్రాజక్టుపై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరింపించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. విశాఖపట్నం ఉక్కును రక్షించేది.. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు.. ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు. విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయం చంద్రబాబు చేతిలో ఉందని తెలిపారు. 50 ఏళ్ల నుంచి చంద్రబాబు తనకు తెలుసునని అన్నారు. చంద్రబాబుకు ఉన్న లక్ ఎవరికీ లేదని అన్నారు. చంద్రబాబు చాలా అదృష్టవంతుడని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపవచ్చని అన్నారు. విశాఖపట్నంలో చింతామోహన్ ఇవాళ(శుక్రవారం) పర్యటించారు.
ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ... తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం..రాజకీయాల్లోకి తీసుకు రావడం మంచిది కాదని అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని..నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ, వంటనూనె కలిపి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ మీద సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు. ధర్మాసనాలు చూడాల్సిన పని రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పారు. చంద్రబాబు సూపర్ 6 అన్నారని..ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఏపీ అంటే అమరావతి.. పోలవరం అని చంద్రబాబు అంటున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరిపించాలని కోరారు. విశాఖపట్నం ఉక్కును రక్షించేది.. కేవలం చంద్రబాబు మాత్రమేనని అన్నారు.. ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు. విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న(గురువారం) తిరుపతిలో మాట్లాడిన తీరు బాగోలేదని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ పవిత్రత మీద చంద్రబాబు మాట్లాడటం తప్పు అని చెప్పారు. మాజీ సీఎం జగన్‌ను రాజకీయాల్లో దెబ్బ కొట్టాలంటే... బెయిల్ రద్దు అయ్యేలా చూడాలన్నారు. దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురాకండని అన్నారు. మోదీ సర్కార్ ఎప్పుడైనా అధికారంలో నుంచి పడిపోవచ్చు. హర్యానా ఎన్నికల తర్వాత బహుశా మోదీ ప్రభుత్వం పడిపోతుందోమోనని చింతా మోహన్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..
భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News