Chandrababu: దుర్మార్గమైన పాలనను తరిమి కొట్టేందుకే ఈ పొత్తులు
ABN , Publish Date - Apr 11 , 2024 | 08:01 PM
దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీని కాపాడటానికే తెలుగుదేశం - జనసేన - బీజేపీ మూడు పార్టీలు కలిసి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. గురువారం నాడు అంబాజీపేటలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంబాజీపేట: దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీని కాపాడటానికే తెలుగుదేశం - జనసేన - బీజేపీ మూడు పార్టీలు కలిసి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. గురువారం నాడు అంబాజీపేటలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ (CM Jagan)పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచారని మండిపడ్డారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. మంచి నీళ్లు అడిగితే కోనసీమ వాసులు కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి సంస్కారం ఇక్కడ ఉందని తెలిపారు. కానీ కోనసీమ జిల్లాలో ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.
జగన్ ఒక్క డీఎస్సీ ఇవ్వలేదని , ఉద్యోగాలు ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని విరుచుకుపడ్డారు. దళితులకు విదేశీ విద్య రద్దు చేశారన్నారు. 6 వేల మంది దళితులపై కేసులు పెట్టారని చంద్రబాబు వాపోయారు.
YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?
జగన్ పాలనలో 186 మంది దళితులను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాపులకు న్యాయం చేస్తామని మాటిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటుచేసి పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి
Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి