Amarnath Reddy: జగన్ పుట్టకముందే కుప్పంలో అభివృద్ధి
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:47 PM
కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) రీ కౌంటర్ ఇచ్చారు. కుప్పానికి వైసీపీ ప్రభుత్వమే హంద్రీనీవా నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు. 470 కిలోమీటర్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీ నీవా పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చామని చెప్పారు.
చిత్తూరు: కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) రీ కౌంటర్ ఇచ్చారు. కుప్పానికి వైసీపీ ప్రభుత్వమే హంద్రీనీవా నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు. 470 కిలోమీటర్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీ నీవా పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చామని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో మిగిలిన 30 కిలోమీటర్లు పనులు కూడా వైసీపీ అసమర్థ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. కుప్పానికి తామే నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం దిగజారుడు రాజకీయతనమని అన్నారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే కుప్పానికి ఆగమేఘాలపై హంద్రీనీవా జలాల ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. కుప్పానికి ఇలాంటి అభివృద్ధి చేయకపోతే కుప్పం ప్రజలు చంద్రబాబును ఏడుసార్లు ఎలా గెలిపించి ఉంటారో తెలియదా అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి పుట్టకముందే కుప్పంలో అభివృద్ధి మొదలైందని చెప్పారు. కుప్పం గతంలో ఏ విధంగా ఉండేదో జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు కాబట్టి ఆయనకు తెలియదు. ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీ, చంద్రబాబు నాయుడుదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నీరు రేపోమాపు నిలిచిపోతుందన్నారు. మీడియాపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. భవిష్యత్తులో మీడియా ప్రతినిధులు లోగోలకు బదులు కత్తులు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అమర్నాథరెడ్డి అన్నారు.