Share News

Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం

ABN , Publish Date - Jul 25 , 2024 | 02:50 PM

Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్నిప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్, రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్‌కు ఆర్డీవో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం
Madanapalli Fire Incident

అమరావతి, జూలై 25: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్నిప్రమాదం కేసులో (Madanapalli Fire Incident) పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్, రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్‌కు ఆర్డీవో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీవో, అక్కడ ఉన్న సీఐ వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

KCR: కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం.. బడ్జెట్‌పై కేసీఆర్


గౌతం వ్యవహారశైలిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పాత ఆర్డీవో రెండు రోజులు పాటు మదనపల్లిలోనే మకాం చేయడంపై కూడా ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీఐడీ డీజీ రవిశంకర్ ఆయన్నార్‌ను ప్రభుత్వం మళ్లీ మదనపల్లికి పంపిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటికే మదనపల్లి మకాం వేసి రెవిన్యూ పరంగా ఉన్న పరిస్థితిను సమీక్షిస్తున్నారు.

YS Jagan: పోలవరం జాప్యానికి జగన్ కారణం.. పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం



కాగా.. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఈనెల 21న(ఆదివారం రాత్రి) అగ్నిప్రమాదం సంభవించింది. ‘22ఏ’ సెక్షన్‌లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం తొలత భావించినప్పటికీ... అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..


అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైళ్ల దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మినిట్‌ టు మినిట్ ఏం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: దేశంలోనే ఈవేస్ట్‌లో ఏపీ 12వ స్థానం

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 02:53 PM