Share News

Chandrababu: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 25 , 2024 | 02:25 PM

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటెయిన్ చేశారన్నారు.

Chandrababu: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, జులై 25: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటెయిన్ చేశారన్నారు.

Also Read: Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!


ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడం కోసం..

గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని.. ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

cbn-garu.jpg

Also Read: Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయం


హైదరాబాద్‌లో మత ఘర్షణలపై ఉక్కుపాదం..

అలాగే హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణిచి వేశామన్నారు. దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్‌ను నిలిపామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. వామపక్ష తీవ్రవాదాన్ని సైతం గ్రేహౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశామన్నారు.

Also Read: Maharastra: ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ


సాంకేతికతతో శాంతి భద్రతలు..

ఇక రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీయిజం కనిపిస్తే.. దానిని సైతం ఉక్కుపాదంతో అణిచి వేశామని తెలిపారు. తమ ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగి ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం అయితే వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించుకోని శాంతి భద్రతలను కాపాడామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సోదాహరణగా వివరించారు.

Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు


అందుకే కూటమికి పట్టం..

ఇటీవల లోక్‌సభతోపాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఓటరు.. ఎన్డీయే కూటమికి పట్టం కట్టాడు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గత జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధే కాదు.. శాంతి భద్రతలు సైతం క్షీణించాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి రంగంపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. అందులోభాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 25 , 2024 | 05:10 PM