Ayyanna Patrudu: విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం కల్పించిన స్పీకర్
ABN , Publish Date - Jul 25 , 2024 | 02:00 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా చదువుకునే విద్యార్థులకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం ఆయన కల్పించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ (AP Speaker) చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విద్యార్థులకు (Students) అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) చూసే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా చదువుకునే విద్యార్థులకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం ఆయన కల్పించారు. ప్రతిరోజు 100 మంది సభను చూసే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా వివిధ కాలేజీల నుండి విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు వీక్షిస్తున్నారు. గురువారం నాల్గవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 మంది సమావేశాలు స్వయంగా వీక్షించారు. స్వయంగా అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్దులు అంటున్నారు. టీవీలలో చూడటం తప్ప స్వయంగా వచ్చి ఈ అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
కాగా తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది. శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ, ఆమోదం సమయంలోనూ పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించాలనే ఉద్దేశంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛమైన తెలుగులో ఆయన మాట్లాడుతుంటే సభలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆశ్చర్యపోయారు. ఒక్క ఆంగ్లపదాన్ని వాడకుండా అయ్యన్నపాత్రుడు రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని సంబంధిత మంత్రులను కోరడంతో పాటు.. బిల్లులు ఆమోదం పొందాయని ఆయన తెలుగులోనే ప్రకటించారు. జనసేన, వైసీపీ పార్టీలకు సంబంధించి విప్, శాసనసభ పక్ష నేతల నియామకాలకు సంబంధించిన సమాచారం తనకు అందిందంటూ ఆయన పూర్తిగా తెలుగులోనే చదివారు. రెండు పార్టీల నుంచి తనకు వర్తమనానాలు అందయంటూ అయ్యన్నపాత్రుడు చేసిన భాష ప్రయోగంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త సంప్రదాయం..
తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడంతో పాటు.. మాతృ భాష ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగుభాషనే ఉపయోగిస్తూ కొత్త సంప్రదాయానికి నాందిపలికారు. మంగళవారం, బుధవారం సభలో ప్రవేశపెట్టిన బిల్లుల సందర్భంగా బిల్లులు ప్రతిపాదించే సమయంలోనూ, ఆమోదం పొందే సమయంలోనూ ఆయన పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించారు. తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నానని.. సభ్యలుంతా సహకరించాలని ఆయన కోరారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో బుధవారం సభలో కొంతమంది మంత్రులు, సభ్యులు సైతం ఎక్కువుగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం సభలో విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును సంబంధింత శాఖ మంత్రి సత్యకుమార్ ఆంగ్లంలో ప్రతిపాదించగా.. బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాధాన్యతను పెంచే ఉద్దేశంతో స్పీకర్ అయ్యనపాత్రుడు తీసుకున్న చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటి: హోంమంత్రి అనిత
గంజాయి మత్తులో అనేక దారుణాలు: హోంమంత్రి అనిత
పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News