Veerabhadraswamy: అందరూ ఏకమైనా.. విజయం జగన్‌దే..
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:10 PM
Andhrapradesh: చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యలేదని.. పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారన్నారు. అందరూ ఏకమైన.. రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తిరుమల, మార్చి 18: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ఎప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యలేదని.. పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి (Deputy Speaker Veerabhadra Swamy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారన్నారు. అందరూ ఏకమైన.. రానున్న ఎన్నికల్లో జగనే (CM Jagan) విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చెయ్యలేక పొత్తులతో పోటీ చేస్తున్నారన్నారు. పొత్తులో భాగంగా తాను గెలిస్తే చాలనుకొని.. సీట్లను కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చెయ్యలేదని విమర్శించారు. అనుభవం ఉన్న కారణంగానే గతంలో ప్రజలు చంద్రబాబును గెలిపించారని.. బాబు పరిపాలనలో వేల కోట్ల నిధులు వృధాయ్యాయని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందతోందన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకే వైఎస్‌ఆర్ పార్టీ పుట్టిందన్నారు. చంద్రబాబుకు అన్ని పార్టీలతో లోపాయకారి ఒప్పొందాలు ఉన్నాయని వీరభద్రస్వామి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్.. కవిత అరెస్ట్‌పై ఏమంటారో..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...