Tirumala: తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు చర్యలు: ఈవో శ్యామలరావు
ABN , Publish Date - Sep 01 , 2024 | 06:39 PM
తిరుమల.. స్వామి వారీ దర్శనార్థం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గత రెండున్నర మాసాల్లో పలు మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల: తిరుమల.. స్వామి వారీ దర్శనార్థం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గత రెండున్నర మాసాల్లో పలు మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో విరివిగా అన్నప్రాసాదాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల నాణ్యతని పెంచినట్లు వెల్లడించారు. ఎస్టీ టోకెన్లు కోటాను పెంచామని అన్నారు.
గతంలో ప్రతి వారం 1.05 లక్షలు ఇస్తుండగా..ప్రస్తుతం 1.6 లక్షల టోకెన్లను జారీ చేస్తున్నామని వివరించారు. తిరుమలలో దళారీలను ఏరి వేసేందుకు పలు కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. దళారీ వ్యవస్థను అరికట్టెందుకు లడ్డు జారీ విధానంలో మార్పులు చేశామని అన్నారు. పలు చోట్ల వివాహల్లో కూడా శ్రీవారి లడ్డును పంపిణీ చేస్తున్నామని వివరించారు. స్వామి వారీ లడ్డుని పంచడం కొందరు స్టేటస్‌గా భావిస్తున్నారని చెప్పారు. 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తా ఉంటే..దర్శనం టోకెన్ లేని భక్తులే లక్ష లడ్డూలను పొందుతున్నారని చెప్పారు.
లడ్డు పంపిణీపై కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దర్శనం చేసుకున్న భక్తులకు ఆధార్ కార్డుతో పనిలేకుండా ఎన్ని లడ్డూలైనా ఇస్తామని స్పష్టం చేశారు. దర్శనం టికెట్లేని భక్తులకు ఆధార్ కార్డుపై కేవలం రెండు లడ్డులను మాత్రమే ఇస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా లడ్డులను భక్తులకు విక్రయిస్తున్నామని తెలిపారు. సమాచార కేంద్రాల నుంచి కూడా లడ్డులకు భారీగా డిమాండ్ ఉందని అన్నారు. టీటీడీలోని పలువురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లడ్డులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడారని ఆరోపణలు చేశారు. లడ్డులని అక్రమంగా విక్రయించిన వారీపై విచారణ జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే లడ్డు దళారీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో లడ్డు ధర కొంత పెరిగిందని స్పష్టం చేశారు. లడ్డు పంపిణీలో మార్పులు చేసిన తర్వాత..దళారీలను అరికట్టామని ఈవో శ్యామలరావు వెల్లడించారు.