Tirumala: జగన్, షర్మిలపై మంత్రి అనగాని నిప్పులు
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:13 PM
Andhrapradesh: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీవారి సేవలో తరించారు. మంత్రులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. దర్శనానంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాలను వారికి అందజేశారు. అలాగే నిర్మాత నాగ వంశీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబర్ 29: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంచి ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటారు భక్తులు. వారాంతాలు, సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. అలాగే శ్రీవారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా ఈరోజు (మంగళవారం) తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీవారి సేవలో తరించారు. మంత్రులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. దర్శనానంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాలను వారికి అందజేశారు. అలాగే నిర్మాత నాగ వంశీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే
తిరుమలకు మంత్రి అనగాని
ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం శ్రీనివాసుడిని దర్శించారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మొదటి సారి జిల్లాకు వచ్చానని తెలిపారు. బృహత్తరమైనటువంటి బాధ్యతను సీఎం తనపై ఉంచారన్నారు. మంచి ప్రణాళిక, లక్ష్యంతో రాష్ట్రాన్ని పునః నిర్మించుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంకల్పించారన్నారు. 130 రోజుల్లో 130 కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. జగన్, షర్మిల మధ్య కుటుంబ సమస్యను తమపై రుద్దడం కరెక్ట్ కాదన్నారు. అబద్ధాల పునాదుల్లో నుంచి వైసీపీ పార్టీ పుట్టిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పి.. జగన్ నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో ఇలాంటి ఇబ్బంది లేదన్నారు. కుటుంబ సమస్యలు వాస్తవమని షర్మిల బహిర్గతం చేస్తే తమపై విమర్శలు చేయడం తగదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
మనవడి పుట్టెంట్రుకల కోసం...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనవడి పుట్టెంట్రుకలు శ్రీవారికి సమర్పించినట్లు తెలిపారు. ‘‘నా వివాహం కూడా తిరుమలలో జరగడం నా అదృష్టం’’ అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు సీఎం రేవంత్ రెడ్డికి శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం
Tirumala: జగన్, షర్మిలపై మంత్రి అనగాని నిప్పులు
Read Latest AP News And Telugu News