Share News

Payyavula Keshav: టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడింది

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:13 PM

టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.

Payyavula Keshav: టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడింది
Payyavula Keshav

తిరుమల: టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ధర్మపరిరక్షణలో భాగంగా తిరుమలలో మార్పు మొదలైందని వివరించారు.


టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడతుందని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ భావ వ్యక్తికరణను వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి కూడా ప్రశ్నించే అవకాశం ప్రజలకు దక్కిందని వివరించారు. రాష్ట్రంలో పలు చోట్ల కొంతమంది వ్యక్తులు ఫైల్స్ దగ్ధం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించిందని చెప్పారు. ఇకపై ఫైల్స్ సంరక్షణ బాధ్యత ఆ శాఖ విభాగాధిపతిదేనని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.


అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలి: ఎంపీ శివ‌నాథ్

kesineni-chinni-nomination.jpg

జల వనరుల శాఖ ఏపీలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించటం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) తెలిపారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం-2024 వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. జలవనరుల నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతికతను ఏకీకృతం చేయడంపై సమగ్ర స్థాయిలో చర్చలు జరగాలని సూచించారు. సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ , నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 01:20 PM