TTD: రమణ దీక్షితులుపై టీటీడీ వేటు
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:05 PM
Andhrapradesh: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షులుపై కీలక నిర్ణయం తీసుకుంది...
తిరుమల, ఫిబ్రవరి 26: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Ramana Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. దీక్షితులుపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రమణ దీక్షితులుపై వేటు వేస్తూ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
వీడియోలో ఏముందంటే..
కాగా.. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణదీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని అన్నారు అంటూ టీటీడీపై, ఈవోపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే వీడియోలో అంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయంటూ బీసీయూ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు రామచంద్రయాదవ్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...