Share News

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:08 AM

Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు.

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్
Madanapalli fire incident

అన్నమయ్య జిల్లా, జూలై 23: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం (Madanapalli fire incident) జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది. డీజీపీ ద్వారక తిరుమలరావు ఆధ్వర్యంలో ముమ్మర విచారణ జరుగుతోంది.

TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ


మదనపల్లికి మరికొంతమంది...

మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు మదనపల్లె వెళ్లనున్నారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను వెళ్లమని ఆదేశాలు జారీ అయ్యింది. మరోవైపు ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీజెన్‌కో సీఎండీలను కూడా ఘటనా స్థలానికి వెళ్లి తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపమని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేప్టీ ఇంజరీంగ్ సంస్థ నుంచి నిపుణులను ప్రభుత్వం పిలిపించనుంది. పైళ్ల దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. చిన్న ఆధారం దొరికినా వదలకుండా ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?


ఇదీ జరిగింది...

కాగా.. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ‘22ఏ’ సెక్షన్‌లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం తొలత భావించినప్పటికీ... అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.


అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైళ్ల దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మినిట్‌ టు మినిట్ ఏం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 10:23 AM