SIT: టీటీడీ లడ్డూ వివాదం.. తిరుపతికి సిట్.. విచారణ షురూ
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:30 PM
Andhrapradesh: సిట్ అధిపతి ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు సీఐ సత్యనారాయణ (అన్నమయ్య జిల్లా) తిరుపతికి చేరుకున్నారు.
తిరుపతి, సెప్టెంబర్ 28: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) తిరుపతికి చేరుకుంది. సిట్ అధిపతి, ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు సీఐ సత్యనారాయణ (అన్నమయ్య జిల్లా) తిరుపతికి చేరుకున్నారు.
సిట్‌లో సభ్యుడు తిరుపతి అడ్మిన్ ఎఎస్పీ వెంకటరావు స్థానికంగా ఉంటూ విచారణకు సహకరించనున్నారు. ముందుగా పోలీసు గెస్టు హౌస్‌కు చేరుకున్న సిట్ బృందం.. ఆపై తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలకు వెళ్లి టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలని సిట్ బృందం కలువనుంది. ఆపై తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం సభ్యులు దర్శించుకోనున్నారు. ఆ తరువాత తిరుమల అన్నమయ్య భవన్ సిట్ సమావేశం కానుంది.
కాగా... తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్ నెయ్యి కల్తీపై విచారణకు సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వ శ్రేష్ఠ త్రిపాటిని సిట్ అధిపతిగా నియమించింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్‌లో పనిచేసిన గోపీనాథ్ జెట్టిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించారు. మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది. ఈ సిట్ టీమ్‌లో మరి కొంతమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను ఏపీ ప్రభుత్వం నియమించనుంది. కాగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి...
Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి
Perni Nani: చంద్రబాబుపై మరోసారి నోరుపారేసుకున్న పేర్నినాని
Read Latest AP News And Telugu News