Share News

Hyderabad: 200 మంది పోకిరీలకు జైలు శిక్ష..

ABN , Publish Date - Oct 05 , 2024 | 10:13 AM

గణేశ్‌ నిమజ్జనం, శోభాయాత్రలో షీటీమ్స్‌ పోలీసులు మఫ్టీలో రంగంలోకి దిగి మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించారు. డీసీపీ కవిత పర్యవేక్షణలో షీటీమ్స్‌ ఆధ్వర్యంలో సిటీ కమిషనరేట్‌(City Commissionerate) పరిధిలో 12 బృందాలతో పాటు, ప్రతి పీఎస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది చొప్పున సుమారు 200 మంది పోలీసులు పహారా కాశారు.

Hyderabad: 200 మంది పోకిరీలకు జైలు శిక్ష..

-గణేశ్‌ ఉత్సవాల్లో ఆటకట్టించిన షీ టీమ్స్‌

హైదరాబాద్‌ సిటీ: గణేశ్‌ నిమజ్జనం, శోభాయాత్రలో షీటీమ్స్‌ పోలీసులు మఫ్టీలో రంగంలోకి దిగి మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించారు. డీసీపీ కవిత పర్యవేక్షణలో షీటీమ్స్‌ ఆధ్వర్యంలో సిటీ కమిషనరేట్‌(City Commissionerate) పరిధిలో 12 బృందాలతో పాటు, ప్రతి పీఎస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది చొప్పున సుమారు 200 మంది పోలీసులు పహారా కాశారు. మహిళల పట్ల వికృతచేష్టలకు పాల్పడిన 996 మంది పోకిరీలను పట్టుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..


జనసమ్మర్ధ ప్రాంతాల్లో మహిళలు, యువతులు, బాలికలపై కొంతమంది పోకిరీలు, ఆకతాయిలు కావాలనే అసభ్యంగా ప్రవర్తించడం, తాకరానిచోట తాకడం, ఎవరూ చూడట్లేదనుకొని మహిళలపట్ల ఇష్టానుసారంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతుండటాన్ని షీటీమ్స్‌ పోలీసులు ఫొటోలు తీసి, వీడియోలతో సహా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో నేర తీవ్రతను బట్టి సాక్ష్యాధారాలతో సహా.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. 200 మంది పోకిరీలకు న్యాయస్థానం 3 రోజుల జైలు శిక్ష, రూ. 1050లు జరిమానా విధించినట్లు షీ టీమ్స్‌ డీసీపీ కవిత వెల్లడించారు.


మిగిలిన పోకిరీలకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియోలను చూపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి కఠినమైన వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

భద్రతకు భరోసా..

పోకిరీలు, ఆకతాయిల వికృత చేష్టల వల్ల ఇబ్బందులు పడే బాధిత మహిళలు డయల్‌-100 లేదా సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490616555కు ఫోన్‌ చేయొచ్చు. బాధిత మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతాం.

- ధార కవిత, డీసీపీ షీటీమ్స్‌


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 10:13 AM