Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే | Nane biyyam Batukamma Festival Special Hyderabad Telangana Suchi
Share News

Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే

ABN , Publish Date - Oct 05 , 2024 | 09:51 AM

Telangana: ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలతో బతుకమ్మను పేర్చిన మహిళలు నాలుగో రోజు అంటే నానే బియ్యం బతుకమ్మ రోజున నాలుగు వరుసలతో బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు.

Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే
Nane Biyyam Bathukamma

తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) వేడుకలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఊరూవాడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతీ రోజు సాయంత్రం మహిళలు బతుకమ్మలను పేరుస్తూ ఆడిపాడి ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్నారు. పండుగలో భాగంగా నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మను పేర్చుతారు. ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలతో బతుకమ్మను పేర్చిన మహిళలు నాలుగో రోజు అంటే నానే బియ్యం బతుకమ్మ రోజున నాలుగు వరుసలతో బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు. తంగేడు పువ్వు, గునుగు పువ్వుతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. ఈరోజు నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు కాబట్టి నానే బియ్యం బతుకమ్మ అనే పేరు వచ్చింది. అలాగే పసుపుతో గౌరమ్మ తయారు చేసి బతుకమ్మపై ఉంచుతారు. ఈరోజు నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు.

Viral: టైం వేస్ట్.. ఐఫోన్ 16 ప్రోపై టెకీ తీవ్ర అసంతృప్తి! కారణం ఏంటంటే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఉదయాన్నే మహిళలు ఇంటిని శుభ్రం చేసుకుని తంగేడు పువ్వు, గునుగు పువ్వుతో పాటు రంగురంగుల పువ్వులను తీసుకువస్తారు. అనంతరం ఓ పల్లెంలో తీరొక్క పువ్వును పేరుస్తారు. ముందుగా తంగేడు పువ్వును పేర్చి.. ఆ తరువాత గునుగు పువ్వును మరొక వరుసలో ఉంచుతారు. ఆపై మరో వరుసలో రంగు రంగుల పువ్వులను పేరుస్తూ వస్తారు. ఇలా నాలుగు వరుసల్లో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేర్చుతారు మహిళలు. బతుకమ్మను పేర్చిన తరువాత పసుపుతో చేసిన గౌరమ్మను బతుకమ్మపై ఉంచుతారు. నైవేద్యంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి చేస్తారు.


నానబెట్టిన బియ్యాన్ని మెత్తాగా రుబ్బి అందులో పాలు, బెల్లం కలిపి బియ్యపు చలిమిడి తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ సిద్ధమైన తరువాత వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో బతుకమ్మతో పాటు నైవేద్యాన్ని ఉంచుతారు. చుట్టుపక్కల మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆపై చిన్నారులతో పాటు పెద్దలు కూడా నానె బియ్యం నైవేద్యాన్ని పంచుతారు. ఆ తరువాత బతుకమ్మకు నీటిలో నిమజ్జనం చేయడంతో నాలుగో రోజు బతుకమ్మ సంబరాలు పూర్తి అవుతాయి.

bathukamma.jpg

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


మూడో రోజు దేవీ నవరాత్రి ఉత్సవాలు

మరోవైపు దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా వైభంగా జరుగుతున్నాయి. మూడవ రోజుకు శరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

రూ.100 కోట్లకు మరో దావా వేస్తా

Read Latest Devotional News And Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 09:55 AM