AP News: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. అంతలోనే ట్విస్ట్
ABN , Publish Date - Aug 09 , 2024 | 09:40 AM
Andhrapradesh: వివాహ బంధాలను కొందరు కాల రాస్తున్నారు. పెళ్లిలో చేసిన ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైపోతున్నారు ప్రబుద్ధులు. మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విషయం తెలిసిన మొదటి భార్యలు.. భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా గుణపాఠం చెబుతుంటారు.
తిరుమల, ఆగస్టు 9: వివాహ బంధాలను (Marriage) కొందరు కాల రాస్తున్నారు. పెళ్లిలో చేసిన ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైపోతున్నారు ప్రబుద్ధులు. మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విషయం తెలిసిన మొదటి భార్యలు.. భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా గుణపాఠం చెబుతుంటారు. తమ జీవితంలా మరొకరి జీవితం నాశనం కాకుండా అడ్డుకుంటుంటారు. పోలీసుల సహాయంతో నిత్య పెళ్లికొడుకులకు బుద్ధివచ్చేలా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా రెండో వివాహానికి సిద్ధమైన భర్త గుట్టును రట్టు చేసింది భార్య.
YS Jagan: బెంగుళూరులో ఏం పోగొట్టుకున్నావ్ జగన్ రెడ్డీ?
తిరుమలలోని (Tirumala) గోగర్భం డ్యాం వద్ద వున్న ఓ మఠం వద్ద వివాహ వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన రాకేష్ రెండో పెళ్ళి చేసుకున్నేందుకు యత్నించాడు. విషయం తెలిసిన మొదటి భార్య సంధ్య హుటాహుటిన అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపివేసింది. కళ్యాణ మండపం వద్దకు సంధ్య రావడంతోనే రాకేష్, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తిరుమల పోలీసు స్టేషన్‌లో మొదటి భార్య సంధ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Duvvada Srinivas : భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం
సంధ్య ఆవేదన
ఈ విషయంపై సంధ్య మీడియాతో మాట్లాడుతూ... ‘‘నా భర్త రెండో పెళ్ళి చేసుకున్నెందుకు సిద్దమయ్యాడు.. సమాచారం తెలుసుకొని వచ్చి పెళ్ళిని నిలిపివేశా..మాకు ఏడేళ్ల పాప ఉంది.. మా మధ్య వివాదంకు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది.. మాకు న్యాయస్థానం ఇంకా విడాకులు మంజూరు చెయ్యలేదు.. నా భర్తతో పాటు ఉండేందుకు న్యాయస్థానం నాకు అనుమతి మంజూరు చేసింది.. రాజకీయ నాయకుల అండదండలతో నా భర్త.. నా పై దాడి చేసి ఇంటి నుంచి తరిమేసాడు’’ అని సంధ్య వాపోయింది.
ఇవి కూడా చదవండి..
Grama Sachivalayam : సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన
Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!
Read Latest AP News And Telugu News