Share News

దేశానికి తీరని లోటు: బాబు

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:13 AM

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దేశానికి తీరని లోటు: బాబు

అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రత మూర్తీభవించిన మన్మోహన్‌సింగ్‌ గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్‌’ వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, మన్మోహన్‌సింగ్‌ మరణం పట్ల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • పవన్‌ దిగ్ర్భాంతి

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మరణంపట్ల డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణల ఆద్యులలో మన్మోహన్‌ ఒకరు. డాక్టర్‌ మన్మోహన్‌ అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 05:14 AM