AP Politics: జగన్ పులివెందులలో కూడా ఓడిపోతారు: గంటా శ్రీనివాస రావు
ABN , Publish Date - Jan 28 , 2024 | 01:33 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భీమిలి సిద్ధం సభ’లో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భీమిలి సిద్ధం సభ’లో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని.. ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాస రావు ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారు.. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గంటా శ్రీనివాస రావు ఏమన్నారంటే..?
గత ఎన్నికల సమయంలో జగన్ ‘నవ రత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారు. 15 శాతం హామీలే అమలు చేశారు. జగన్ ఎప్పుడూ తాము పాండువులం అంటాటారు. నిజానికి వారు వారు కౌరవులు. ప్రజా వేదిక కూల్చి పాలన ప్రారంభించారు. ఆయన పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్ధులు అణిచివేత కోసం కొనసాగాయి. 2019 ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన చెల్లి, తల్లిని బయటకు పంపేశారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారు. షర్మిల ఆరోపణలపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు. వైసీపీ అంటే నకిలీ పార్టీ, ముగ్గురు రెడ్లు నడుపుతున్నారు. జగన్ ఎప్పుడూ వై నాట్ 175 అంటారు. పులివెందులలో కూడా జగన్ ఓడిపోతారు. అమరావతిని స్మశానం గా మార్చారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. న్యాయ రాజధాని సంగతి ఎంత వరకు వచ్చింది. 100 అడుగులు పాతాళంలోకి వైసీపీని పాతి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు. ఆ పార్టీ మునిగిపోతున్న నావ. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడుతుకున్నారు.
టార్గెట్ పెట్టి జనాలను తరలించినా సీఎం సభ ఫెయిల్ అయింది. తనకు సొంత మీడియా లేదని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. దొంగ ఓట్లతో గెలవాలని జగన్ చూస్తున్నారు. దేశంలో రిచెస్ట్ సీఎం జగన్.పేదల పక్షాన ఉన్నానని అనడం ఈ శతాబ్దం పెద్ద జోక్. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు. ఎక్కడా విలువలు పాటించకుండా నా రాజీనామా ఆమోదించారు. మరి కరణం ధర్మ శ్రీ రాజీనామాను ఎందుకు ఆమోదించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలిసిపోయింది. అందుకే కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న రాజీనామాను ఆమోదించారు అని’ గంటా శ్రీనివాస రావు విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.