Share News

Purandeswari: ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:56 PM

ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.

 Purandeswari: ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరం

రాజమండ్రి: ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరి నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.


Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు

ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎన్డీయే కూటమి అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు తన నామినేషన్ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారని చెప్పారు.


YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్

సమన్వయ కమీటీలు ఏర్పాటు చేసుకుని మూడు పార్టీల క్యాడర్‌ను ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని చెప్పారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు.


AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ

దళిత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం రూ.57 కోట్లు మంజూరు చేసినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చారని దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 06:06 PM