AP Politics: ఎన్నికల్లో వారిని పట్టించుకునేది లేదు.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 20 , 2024 | 06:55 PM
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి సంకల్పంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో అయారాం గయారాం లను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమలాపురంలో 7 సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు.
అమలాపురం, జనవరి 20: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి సంకల్పంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో అయారాం గయారాం లను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమలాపురంలో 7 సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. మండపేటలో మరోసారి జోగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అని అన్నారు.