Share News

AP NEWS: అదనపు కట్నం కోసం వేధింపులు.. నాకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి.. బాధితురాలు ఆవేదన

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:44 PM

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణానికి చెందిన అదనపు కట్నం కోసం భార్య సౌమ్యలక్ష్మిని భర్త రామ్ లక్ష్మణ్ కుమార్, అత్తారింటి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆమె మౌన పోరాటం చేస్తుంది. తనకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ న్యాయం చేయాలిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.

AP NEWS: అదనపు కట్నం కోసం వేధింపులు.. నాకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి.. బాధితురాలు ఆవేదన

కాకినాడ జిల్లా: వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. అగ్నిసాక్షిగా జీవితాంతాం తోడుంటానని మనువాడిన వాడే ఆమె పాలిట యముడిగా మారాడు. అదనపు కట్నం కోసం తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు పాల్పడ్డాడు. ఇన్నాళ్లు అత్తారింటి వేధింపులను పంటి బిగువున భరించింది. తనకు న్యాయం చేయాలని మహిళ మౌన పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణం వైఎస్సార్ గార్డెన్స్‌లో భాష్యం స్కూల్ సమీపంలో భర్త కోసం సౌమ్య లక్ష్మీ అనే మహిళ మౌన పోరాటం చేస్తోంది.


తనను ఇద్దరు ఆడపిల్లలను వదిలి భర్త రామ్ లక్ష్మణ్ కుమార్ వేరే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రాజమండ్రికి చెందిన అల్లుడు రామ్ లక్ష్మణ్ కుమార్ అతని తల్లిదండ్రులు పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ వస్తున్నారని బాధితురాలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులపై అంగర పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అప్పటి నుంచి భార్య, ఇద్దరు కుమార్తెలను వదిలి మరో మహిళతో తన అల్లుడు సహజీవనం చేయడం దారుణమని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు సౌమ్య లక్ష్మీ, ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బాధితురాలు సౌమ్యలక్ష్మికి మద్దతుగా పలుమహిళ సంఘాలు నిలిచాయి.


పవన్ కళ్యాణ్ భరోసా కోసం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల కాలంలో వివిధ కేసులకు సంబంధించిన బాధితులు కోరుతున్నారు. ముఖ్యంగా కిడ్నాప్, వేధింపులు, మోసాల కేసులో తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు పవన్ కళ్యాణ్‌కు విన్నవించుకుంటున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం తన సహాయం కోరుతున్న మహిళల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు.


సంబంధిత అధికారులను అలర్ట్ చేసి బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యను కూటమి ప్రభుత్వం నేతలకు చెప్పుకుంటే పరిష్కారానికి భరోసా వస్తుందనే ఆశతో బాధితులు ఉన్నట్లు ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలులేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైనా సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేస్తుందని, దీంతో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని బాధితులు చెబుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు

YCP Kethi Reddy: ప్యాలెస్‌ను ఖాళీ చేయండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్‌కు నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 06:48 PM