Kakinada: ఆర్ఎమ్‌సీ వైద్య కళాశాలలో అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం..
ABN , Publish Date - Nov 11 , 2024 | 07:05 AM
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. అక్కడే పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి తప్పతాగిన హౌస్ సర్జన్ జగదీశ్.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు.
కాకినాడ: రంగరాయ వైద్యకళాశాల (RMC)లో శనివారం అర్ధరాత్రి ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. మద్యం తాగి హాస్టల్‌కు వచ్చిన హౌస్ సర్జన్ విద్యార్థులతో దారుణంగా వ్యవహరించాడు. వారితో వికృత చేష్టలు చేయించి పైశాచిక ఆనందం పొందాడు. ఎదురు తిరిగిన జూనియర్లను చితకబాదాడు.
అసలేం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. అక్కడే పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి తప్పతాగిన హౌస్ సర్జన్ జగదీశ్.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం ఒంటి గంట నుంచి తెల్లవారుజూము 5 గంటల వరకూ వారితో ఇష్టానుసారంగా వ్యవహించాడు. ఎదురు తిరిగిన ముగ్గురు విద్యార్థులను తీవ్రంగా కొట్టాడు. దాదాపు నాలుగు గంటలపాటు వారితో ఇష్టానుసారం ప్రవర్తించాడు. విద్యార్థులతో వికృత చేష్టలు చేయించాడు. మద్యం తాగి ర్యాంగింగ్ పేరుతో మృగంలా ప్రవర్తించాడు. దాదాపు 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్‌లోకి తీసుకొచ్చి వేధింపులకు దిగాడు. హాస్టల్‌లో అర్ధరాత్రి మెుత్తం నానా హంగామా సృష్టించాడు.
అయితే ర్యాగింగ్ వ్యవహారంపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఆదివారం రోజున విషయాన్ని తెలియజేశారు. జగదీశ్ చేసిన బీభత్సం, చూపించిన ప్రత్యక్ష నరకం గురించి పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేశారు. తమ పిల్లలతో వికృత చేష్టలు చేయించడంపై మండిపడ్డారు. విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అదే రోజు కళాశాల యాజమాన్యం స్పందించింది. అలాగే విషయాన్ని యాంటీ ర్యాగింక్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. విచారణ జరిపి నేడు అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.