Home » Ragging
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. అక్కడే పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి తప్పతాగిన హౌస్ సర్జన్ జగదీశ్.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు.
మీసాలు గడ్డాలు ఉండొద్దని.. తాము చెప్పిన కళ్ళజోడే వాడాలంటూ సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారు. మీసాలు, గడ్డాలు తీసేయాలని, మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల జూనియర్ వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులను యూనివర్సిటీ సైతం బహిష్కరించిందని వారు తెలిపారు.
ర్యాగింగ్ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..