Lagadapati Rajagopal: రాజకీయాలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 08 , 2024 | 02:34 PM
తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ( Lagadapati Rajagopal ) స్పష్టం చేశారు. సోమవారం నాడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ... కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని.. అక్కడికి వెళ్తూ దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్‌ను కలిశానని తెలిపారు. ప్రజల కోసం వారి అవసరాల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టానని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.
రాజమండ్రి: తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ( Lagadapati Rajagopal ) స్పష్టం చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను లగడపాటి రాజగోపాల్ సోమవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ... కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని.. అక్కడికి వెళ్తూ.. మర్యాదపూర్వకంగా హర్షకుమార్‌ను కలిశానని తెలిపారు. ప్రజల కోసం వారి అవసరాల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తిగా విభేదించామని తెలిపారు.
వారికి మద్దతిస్తాను
తాను రాజకీయాల నుంచి తప్పుకునా ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్‌లకి మద్దతు ఇస్తానని తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసిన వారి తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. గతంలో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తనకు చాలా సంతోషకరమన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఆలోచనే లేదని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...