Share News

Pawan Kalyan: రంగంలోకి పవన్.. ఇక నుంచి ఆ పని చేస్తే నేనెంటో చూపిస్తా..

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:12 PM

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan: రంగంలోకి పవన్.. ఇక నుంచి ఆ పని చేస్తే నేనెంటో చూపిస్తా..

కాకినాడ: కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ సీరియస్‌ అయ్యారు. కాకినాడ పోర్టును పవన్ కల్యాణ్ ఇవాళ(శుక్రవారం) పరిశీలించారు. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్లదూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు. పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలోఎంతటివారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.


టీడీపీ ఎమ్మెల్య‌ేపై సీరియస్

అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమార్కులకు సహకరించడం పద్ధతిగా లేదని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు. పోర్టు అధికారుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్‌పై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా బియ్యం రవాణా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోర్టుకు రేషన్ రైస్ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్వయంగా సంబంధిత మంత్రి వచ్చి చెప్పిన అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

RGV: నేను పరారీలో లేను.. పోలీసుల విచారణపై వర్మ వితండవాదం

YS Sharmila: జగన్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. షర్మిల ఎద్దేవా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 09:24 AM