Share News

ఇక పోలవరం.. పరుగులే!

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:22 AM

పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళొచ్చింది. టీడీపీ అఽధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక పోలవరం.. పరుగులే!

  • సీఎం హోదాలో తొలి పర్యటన

  • ఉదయం 11:30 గంటలకు రాక

  • సాయంత్రం 4 గంటల వరకూ ఇక్కడే

  • ప్రాజెక్టులో అణువణువూ పరిశీలన

  • నాడు 72శాతం పనులు పూర్తి

  • నేటికీ అక్కడే పోలవరం ప్రాజెక్టు

  • వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం

  • బ్యారేజీగా మార్చిన వైనం

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళొచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంచనాలు రెట్టింపయ్యాయి.గత ప్రభు త్వంలో సోమవారం పోలవారం అని ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి చంద్రబాబు పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. 2019 నాటికి ఆయన 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు.కానీ అప్పట్లో వైసీపీ అఽధికారంలోకి రావడంతో ప్రాజెక్టు చతికి లపడి ంది.దీనిని మళ్లీ గాడిలో పెట్టడానికి కూటమి ముఖ్య మంత్రిగా చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరం రానున్నారు.


చంద్రబాబు రాకతో ముస్తాబు..

ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు ప్రాంతం చంద్రబాబు రాక సందర్భంగా మూడు రోజు లుగా ముస్తాబవుతోంది.పోలవరం ప్రాజె క్టుకు చంద్ర బాబు శంకుస్థాపన చేసిన శిలాఫలక స్థూపం వైసీపీ నిర్లక్ష్యం వల్ల అది తుప్పలతో నిండిపోయింది. దానిని శుభ్రం చేసి అధికారులు అందంగా తయారు చేశారు. స్పిల్‌వే దగ్గర నుంచి ఎగువ, దిగువ కాపర్‌ డ్యా మ్‌లు, డయాఫ్రంవాల్‌ నిర్మించిన గోదావరి ప్రాంతం, పవర్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతాల్లో వాహనరాకపోకలకు వీలుగా దారి ఏర్పాటు చేసి టెంట్లు వేశారు.

నాడు ప్రాజెక్టు పనుల పరిస్థితి ఇదీ..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌వే పనులు పూర్తయ్యాయి. హెడ్‌వర్కు పనులు 72.63 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 92.75 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 73.07 శాతం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు 22.55 శాతం మాత్రమే అయ్యాయి.స్పిల్‌వే రేడియల్‌ గేట్ల అమరిక పూర్త యింది. రెండు కాఫర్‌ డ్యామ్‌ పనులు సుమారుగా పూర్తయ్యాయి. ఈసీ ఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు సంబంధించి గతంలో డయాఫ్రంవాల్‌ నిర్మాణం పూర్తి చేశారు. మరమ్మతులు చేస్తున్నారు. స్పిల్‌ ఛానల్‌ పనులు 88 శాతం, అప్రోచ్‌ ఛానల్‌ పనులు 79 శాతం, పైలట్‌ చానల్‌ పనులు 48 శాతం, లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ అనుసంధాన పనులు 68 శాతం పూర్తయ్యాయి . చంద్రబాబు రాకతో ప్రాజెక్టుతో పాటు అన్ని పనులు చకచకా పరుగులు తీయనున్నాయి. సీఎం చంద్ర బాబు సోమవారం ఉదయం 11:30 గంటలకు వచ్చి, సాయంత్రం 4 గంటల వరకూ ఇక్కడే ఉండనున్నారు.


ఐదేళ్లూ వైసీపీ ఏం చేసింది..

వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ దిక్కూ మొక్కూ లేకుండా ఈ ప్రాజెక్టు పడి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయి నీటితో కళకళలాడవలసిన ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అప్పట్లో చంద్ర బాబు స్పిల్‌వే పనులు సుమారు పూర్తి చేసి గేటు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పనిని మాత్రమే కొనసాగించి మిగతా వాటిని నిర్లక్ష్యం చేసింది. స్పిల్‌వే పూర్తయినా ప్రధాన కాలువలు పూర్తి కానందున కనీసం గ్రావిటీ ద్వారా కూడా స్పిల్‌వే నుంచి ప్రధాన కాలువలకు నీరు పంపే పరిస్థితి కూడా లేదు. ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌( ఈసీ ఆర్‌ఎఫ్‌) పూర్తి చేసి కుడి ప్రధాన,ఎడమ ప్రధాన కాలువల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే ఈ ప్రాజె క్టుకు ఒక రూపు వచ్చేది. కానీ కేవలం బ్యారే జీలా తయారు చేశారు.వరద నీటిని కొంత ఆపి మళ్లీ సము ద్రంలోకి వదలడానికి తప్ప ఎందుకు కొరగాని ప్రాజెక్టుగా ఉండిపోయింది.2019 ఎన్నికల ముందు టీడీపీ హయాం లో ప్రాజెక్టు పనులు చూడడానికి వేలాదిగా సందర్శకులు వచ్చేవారు.

వందలాది యంత్రాలతో పనులు జరుగుతుం డేవి. ప్రజలు ఎంతో ఆనందపడేవారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఇసుక ఫిల్లింగ్‌ ఓ మాదిరిగా చేస్తూ దానిని రెండు యంత్రాలతో వైబ్రో కాం పాక్షన్‌ చేసే పని మాత్రం కొంతవరకూ చేశారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ నిర్వహణ వదిలేయడం వల్ల ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నుంచి లీకులు ఏర్పడ్డాయి. లీకవుతున్న నీటిని తోడి బిల్లులుచేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన డ్యామ్‌ అయిన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌పూర్తయితేనే పోల వరం ప్రాజెక్టు రిజర్వాయరు నిర్మించినట్టు అవుతుంది. కాని దీని నిర్మాణానికి గోదావరి నదిలో నిర్మించిన డయా ఫ్రం వాల్‌ విషయంలో రాజకీయం చేశారు. 2022మే లో ఇక్కడ కావాలని గొయ్యిపెట్టి డయాఫ్రంవాల్‌ దెబ్బతిన్న ట్టు రాజకీయం చేశారని కూడా విమర్శలు ఉన్నాయి. గోదావరికి అడ్డంగా ఎగువ కాపర్‌ డ్యామ్‌ను ఉద్దేశపూ ర్వకంగా కొంత ఎత్తు పెంచడంతో ఫారెస్ట్‌లోని గ్రామాలు, పాపికొండల ప్రాంతం బాగా మునిగిపోతుంది. పున వాసం కల్పించకుండా గత ప్రభుత్వం అనేక ముంపు గ్రామాల ప్రజలు ముప్పుతిప్పలు పెట్టింది. 2021కే పూర్తి కావలసిన ఈ ప్రాజెకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు.


నేడు టూర్‌ ఇలా..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమ వారం ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు పోలవరం చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతారు. 11.55కి హెలిప్యాడ్‌ వద్ద వ్యూపాయింట్‌కు చేరుకుంటారు. గైడ్‌ బండ్‌, గ్యాప్‌-3, ఎగువ కాపర్‌, గ్యాప్‌-1, గ్యాప్‌ -2 , దిగువ కాఫర్‌ డ్యామ్‌, పవర్‌హౌస్‌ పనులు పరిశీలిస్తారు. 1.15 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు లంచ్‌ చేస్తారు. అనంతరం 2:05 నుంచి 3:05 గంటల వరకూ అధికారులతో ప్రాజెక్టుపనులపై సమీక్షిస్తారు. 3:10 గంటల నుంచి 3:40 గంటల వరకూ విలేకరులతో మాట్లాడి 4 గంటలకు అమరావతి బయలుదేరతారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 07:48 AM