Share News

RP Sisodia: రెవెన్యూ సదస్సులో త్వరగా భూ సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:48 PM

RP Sisodia: రెవెన్యూ సదస్సుల ద్వారా త్వరగా భూ సమస్యలను పరిష్కరిస్తామని రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. సమస్యలు తెలుసుకుని వచ్చిన అర్జీలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1, 25000 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులో దీర్ఘకాలిక భూసమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

RP Sisodia: రెవెన్యూ సదస్సులో త్వరగా భూ సమస్యల పరిష్కారం
RP Sisodia

ఏలూరు జిల్లా (కైకలూరు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘‘మీ భూమి - మీ హక్కు’’ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ముదినేపల్లి మండలం పెద్ద పాలపర్రులో ఇవాళ(శుక్రవారం) రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్పీ సిసోడియా హాజరై మాట్లాడారు. 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. 17600 గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యలు తెలుసుకుని వచ్చిన అర్జీలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1, 25000 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులో దీర్ఘకాలిక భూ సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. చిన్న చిన్న భూ సమస్యలు ఈ రెవెన్యూ సదస్సుల వల్ల పరిష్కారం చేయగలుగుతున్నామని అన్నారు. కైకలూరు నియోజకవర్గంలో వందలాది ఎకరాలు అసెన్డ్‌మెంట్‌ ల్యాండ్స్, మిలిటరీ భూములు, పొలిటికల్ సబ్ ల్యాండ్స్ సైతం అనవసరంగా 22ఏ జాబితాలో చేర్చామని అన్నారు. కైకలూరు నియోజకవర్గంలో ఆరు సమస్యలు ఉన్నాయని వీటి మీద రాబోయే కాలంలో దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసేుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..

CM Chandrababu: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 06:57 PM