Share News

AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:49 AM

Andhrapradesh: అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు
YSRCP Leader Arrest

తూర్పుగోదావరి, నవంబర్ 8: సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను గోపాలపురం పోలీసులు విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పోస్టులు చేశారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామానికి చెందిన వైసీపీ నేతగా గుర్తించారు. చంద్రశేఖర్‌పై తూర్పుగోదావరి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయ్యాయి. అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదాపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు



కాగా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. ఇలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కూటమి నేతలపై వైసీపీ మూకలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, తాను స్వయంగా పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో కడప జిల్లా ఎస్పీతో పాటు చిన్న చౌక్ ఇన్‌స్పెక్టర్‌‌పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు, సీఎం సతీమణి భువనేశ్వరిపై అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టారని జగన్‌ సతీమణి భారతీరెడ్డి పీఏ, ఎంపీ అవినాశ్‌ అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై అనేక ఫిర్యాదు నమోదు అయ్యాయి.


దీంతో కడప ఎస్పీ ఆదేశాల మేరకు చిన్నచౌకు సీఐ ఆధ్వర్యంలో రవీందర్ రెడ్డిని వేములలో అరెస్ట్ చేసి కడప జిల్లా తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అంతకంటే బలమైన మరో కేసులో అరెస్ట్‌ చేయడానికి స్టేషన్‌ వద్ద రాజంపేట పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వర్ర రవీందర్‌ రెడ్డి పోలీస్ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ విషయం తెలిసిన రాజంపేట పోలీసులు బయటకు వచ్చి చూడా అప్పటికే వర్రా రవీందర్ రెడ్డి పరారయ్యాడు. ఈ విషయంలో వైసీపీలోని ముఖ్యుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వర్రా రవీందర్ రెడ్డి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కడప ఎస్పీ, చిన్నచౌక్ ఇన్‌‌స్పెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కడప ఎస్పీని బదిలీ చేయగా.. చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Viral Video: హైనాల నుంచి మిత్రుడిని కాపాడుకున్న సింహం.. ప్రాణాలు తీసే సమయంలో చెట్టు పైనుంచి..


వారిపై ప్రత్యేక నిఘా

మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. అనంతపురం ఎస్పీ జగదీశ్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వియోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక టీమ్‍లను రంగంలోకి దింపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన 12 వందలకు పైగా సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసిన ఆరుగురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Harish Rao: మూసీ మురికికూపానికి కారణం మీరు కాదా..

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 11:51 AM