Nails: గోళ్లను ఈ రోజులలో కత్తిరిస్తున్నారా.. దరిద్రం వెంటాడుతుంది..
ABN , Publish Date - Nov 08 , 2024 | 11:39 AM
గోళ్లు అందాన్ని పెంచడం మాటెలా ఉన్నా వాటిని పెంచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటిని పెంచితే మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గోళ్లను ఏ రోజున కత్తిరించుకోవాలి? ఏ రోజులలో కత్తిరించకూడదు అనే విషయాలను తెలుసుకుందాం..
Nails: పూర్వకాలంలో ఏ పని చేసినా పద్దతిగా చేసేవారు. ముఖ్యంగా చేసే పనిలో జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండేవారు. అలా చేయడం వలన ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు వస్తాయని భావించేవారు. అయితే, ఈ కాలంలో ఆ నాటి ఆచారాలను పాటించే వారు చాలా తక్కువ. తమకు ఇష్టమైన సమయంలో నచ్చినట్లు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోళ్లను ఏ రోజున కత్తిరించుకోవాలి? ఏ రోజులలో కత్తిరించకూడదు? ఏ సమయంలో కట్ చేసుకుంటే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం..
ఆరోగ్యంపై ప్రభావం:
గోళ్లు.. అందాన్ని పెంచడం మాటెలా ఉన్నా వాటిని పెంచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతారు. గోళ్లల్లో ఉన్న బాక్టీరియా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. ఎప్పటికప్పుడు పెరిగిన గోళ్లను కత్తిరించుకోవడం మంచిది. సూర్యాస్తమయం సమయంలో గోళ్లను కత్తిరించకూడదు. అంతేకాకుండా రాత్రిపూట కూడా కత్తిరించకూడదు. ఒకవేళ ఆ సమయంలో గోళ్లను కత్తిరిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని జోతిష్యం చెబుతుంది. అంతేకాకుండా ఇంట్లో పేదరికం వస్తుంది. వారంలో ఏ ఏ రోజు గోర్లు కత్తిరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..
సోమవారం: ఈ రోజున గోళ్లను కత్తిరిస్తే తమోగుణం తొలగిపోతుంది. అంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస వంటి తొలగిపోతాయి.
మంగళవారం: ఈ రోజున గోళ్లను కత్తిరించడం ఏ మాత్రం మంచిది కాదు. పొరపాటున కట్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని జ్యోతిష్యం చెబుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు ఇలాంటి అనేక పనులు నిషేదం.
బుధవారం: ఈ రోజు గోళ్లు కత్తిరించడం చాలా మంచిది. గోళ్లు కత్తిరించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. అంతేకాకుండా, తెలివితేటలతో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.
గురువారం: ఈ రోజు గోళ్లు కత్తిరించడం మంచిది. అలా చేయడం వలన మనిషిలో మంచి లక్షణాలు పెరుగుతాయి.
శుక్రవారం: అన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు గోళ్లు కత్తిరించడం చాలా ఉత్తమం. ఇలా చేయడం వలన జీవితంలో సంబంధాలు బలపడతాయి.
శనివారం: ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ గోళ్లను కత్తిరించకూడదు. అలా చేయడం వల్ల జాతకంలో శని బలహీనుడు అవుతాడని జోతిష్యం చెబుతోంది. అంతేకాకుండా అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. ధన నష్టం కూడా కలుగుతుంది. గోళ్లు కత్తిరించడం వల్ల శని గ్రహా ఆగ్రహానికి గురై దరిద్రం వెంటాడుతుంది..
ఆదివారం: ఈ రోజున గోళ్లు కత్తిరించకూడదు. అలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో కూడా గోళ్లు కట్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Note: (ఇలాంటివన్నీ మనుషుల నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు)
Also Read:
For More Health News