Share News

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?
Pemmasani Chandrashekar

ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను (Pemmasani Chandrashekar) బిగ్ డిబేట్‌లో (BIG Debate) ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే, తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, జగన్‌తో తనను పోల్చొద్దని సూచించారు. 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు.30 ఏళ్లు కష్టపడితే, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. జగన్ క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగారని స్పష్టం చేశారు. ఆయన కష్టపడలేదని తేల్చి చెప్పారు. తననే కాదు కష్టపడి పైకి వచ్చిన ఎవరిని జగన్‌తో పోల్చిన అంగీకరించరు అని పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.


Read Latest
Andhra Pradesh News And Telugu News

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Apr 24 , 2024 | 09:24 PM