AP Elections Results 2024: ఆరా మస్తాన్ సర్వే పెద్ద జోక్..హేమంత కుమార్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Jun 03 , 2024 | 08:28 PM
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.
విశాఖపట్నం: 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.ఈ విషయంపై ఆరా మస్తాన్‌కి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ సవాల్ విసిరారు. జిల్లాల వారీగా నిరుద్యోగులతో చేయించిన సర్వే ప్రకారం కూటమికి 98 నుంచి106 అసెంబ్లీ స్థానాలకు మించి వస్తాయని జోస్యం చెప్పారు.
వైసీపీకి ఆయన చెప్పిన సీట్లు రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీకి సుమారు 9 ఎంపీలు వస్తాయని, మిగతావన్నీ కూటమికేనని జోస్యం చెప్పారు. ఆరా మస్తాన్ సర్వేలో ఆయన చెప్పింది అబ్బధమేనని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి సుమారు 104 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆరా మస్తాన్ చెప్పిన మాట పెద్ద జోక్‌లాగా ఉందని విమర్శించారు.క్షేత్రస్థాయిలో వైసీపీకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితి లేదని చెప్పారు.సర్వే అంటే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని.. కానీ కొందరివి మాత్రమే తీసుకోవడం సరికాదని అన్నారు.
ఆరా సర్వే ఫలితాలు అవాస్తవమనిని తేలితే ..ప్రజలకు క్షమాణలు చెప్పి మస్తాన్ శాశ్వతంగా సర్వేలు చేయడం మానేస్తారా.. ఇదే నా సవాల్ అన్నారు. వైసీపీపై ఆరా మస్తాన్‌కు అంత ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయండి..తమకు అభ్యంతరం లేదని సమయం హేమంత కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!
Delhi Liquor Scam::కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. సంచలన విషయాలు వెలుగులోకి..!
CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!
Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
For More AP News and Telugu News..