AP Elections 2024: వాలంటీర్ల చేతుల్లో ప్రజల వ్యక్తిగత సమాచారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..?
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి చ్చిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చౌర్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి చ్చిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చౌర్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిది పోయి.. అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రభుత్వానికి స్వామి భక్తి చూపించాలనుకునే వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
AP News: ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా?
నిన్న ఒక నకిలీ ఉత్తరం బయటపడిందని, సజ్జల భార్గవ్ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురంధేశ్వరి పేరుపై నకిలీ ఐడీ తయారు చేసారన్నారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉందని, చోరీ చేసిన డేటా వైసీపీ చేతి లో ఉందన్నారు. డేటా చౌర్యం పై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని షేక్ బాజి డిమాండ్ చేశారు.
వారిని పోలింగ్ బూతుల్లో నియమించొద్దు..
అంగన్వాడీ, డ్వాక్రా మహిళలను పోలింగ్ బూతుల్లో నియమించద్దని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు షేక్ బాజి తెలిపారు. ఈవీఎం ఐడెంటిఫికేషన్ చేసేలా స్ధానిక బాషల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లకు విడిగా బాక్సులు పెట్టాలని కోరామన్నారు. ఈవిఎం మిషన్ లు మోయలేని వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, అలాంటి వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు పై చర్యలు తీసుకోవాలని షేక్ బాజీ కోరారు.
AP Politics: సంక్షేమ పాలన కోసం టీడీపీని గెలిపించాలి: వసంత కృష్ణ ప్రసాద్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..