Betting: ఏపీలో జోరుగా బెట్టింగులు..!!
ABN , Publish Date - May 12 , 2024 | 02:19 PM
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో (Betting) మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గురించి జోరుగా పందెలు వేస్తున్నారని తెలిసింది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్నారు. టీడీపీ నేత వర్మ కూడా పవన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. కాపులు ఎక్కువ ఉండటంతో గెలుపుపై పవన్ కల్యాణ్ ధీమాతో ఉన్నారు. పిఠాపురంలో వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమెకు కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రచారం చేస్తున్నారు. ఆ సీటులో పవన్ విజయం సాధిస్తారా..? మెజార్టీ ఎంత వస్తుందనే అంశంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
మంగళగిరి నుంచి మరోసారి నారా లోకేశ్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి వైసీపీ నుంచి కాండ్రు లావణ్య పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కోడలు లావణ్య అనే సంగతి తెలిసిందే. ఈ సారి తనను మంగళగిరి ప్రజలు ఆదరిస్తారని నారా లోకేశ్ ధీమాతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..
Read Latest AP News And Telugu News