AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక
ABN , Publish Date - May 12 , 2024 | 10:54 AM
Andhrapradesh: పోలింగ్‌లో అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అమరావతి, మే 12: పోలింగ్‌లో (Elections) అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (AP Chief Electoral Officer Mukesh Kumar Meena) స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని.. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
AP Elections: ‘మేం చెప్పిన వారినే పోలింగ్‌కు తీసుకురండి’... వాలంటీర్లతో వైసీపీ
చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తేల్చిచెప్పారు. మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని మీనా స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఈవో ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
Hyderabad: ఎంత నిర్దయరాలివి తల్లీ! నీ బిడ్డ కాదని ఇంత ఘోరం చేస్తావా?
Read Latest AP News And Telugu News