Share News

AP Election 2024: వారికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారు.. చంద్రబాబు విసుర్లు

ABN , Publish Date - May 09 , 2024 | 05:34 PM

ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు.

AP Election 2024:  వారికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారు.. చంద్రబాబు విసుర్లు
Nara Chandrababu Naidu

విజయనగరం: ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు. ‘‘మీకు దమ్ముంటే ప్రధాన మంత్రి మోదీని... మీ జగన్ రెడ్డి విమర్శించి చూడమను’’ అని చంద్రబాబు సవాల్ విసిరారు. బొత్స పనైపోయిందని అనగానే జనం కేరింతలు కొట్టారు. జగన్ రెడ్డి తెచ్చినవి నవ రత్నాలు కాదని.. అవి నకిలీ రత్నాలని ఎద్దేవా చేశారు.


ఉత్తరాంధ్ర.. టీడీపీకి కంచుకోట అని అన్నారు. ఉత్తరాంధ్రపై టీడీపీకి ప్రత్యేక ప్రేమ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టుపెట్టారని మండిపడ్డారు. జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చిందెంత.. తిన్నదెంత? అని ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు.


100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు. ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్‌ సిక్స్‌ తీసుకొచ్చామని ఉద్ఘాటించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత తమదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తోటపల్లిని పూర్తి చేసి నెలలోగా నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. చీపురుపల్లిలో టీడీపీ సభకు జన సునామీ భారీగా తరలి వచ్చింది. జనసందోహాన్ని చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 06:09 PM